టాలీవుడ్

నిజమేనట, తేజ కన్ఫర్మ్ చేసాడు

Teja interview 1రీసెంట్ గా రానా హీరోగా రూపొందిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో ఒక్కసారిగా మళ్లీ హాట్ టాపిక్ గా మారిన దర్శకుడు తేజ. ఈ సినిమా హిట్ తో ఆయన చేతిలోకు ఓ పెద్ద ప్రాజెక్టు రానుంది. ఆ ప్రాజెక్టు కనుక సెట్ అయితే సెన్సేషన్ అవుతుంది. అదేమిటంటే… బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ని తేజ చేతుల్లో పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే చర్చలు జరిగాయి. మీడియాలోనూ ఈ టాపిక్ పై వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న తరుణంలో, తేజ హైదరాబాద్ టైమ్స్ తో క్లారిటీ ఇచ్చారు.

తేజ మీడియాతో మాట్లాడుతూ… బాలయ్యతో పలుమార్లు ఈ బయోపిక్ విషయంపై కలిసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఫైనల్ డెసిషన్ బాలకృష్ణ గారు అతి త్వరలోనే తెలియజేస్తారు అంటూ తేజ తెలిపాడు. అంతేకాదు ఎన్టీఆర్ అంటే పర్సనల్‌గా ఎంతో అభిమానం ఉన్న తనకు ఇటువంటి అవకాశం రావడం మాములు విషయం కాదని, అసలు ఎన్టీఆర్ బయోపిక్‌ని తీయడం సామాన్య విషయం కాదని తేజ తెలిపాడు. కానీ ఈ ప్రాజెక్ట్‌ని నా శక్తివంచన లేకుండా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని తేజ ఎన్టీఆర్ బయోపిక్‌పై తన ఉత్సాహాన్ని తెలియపరిచాడు.

నిజానికి ఎన్టీఆర్ బయోపిక్‌ని బాలయ్య అనౌన్స్ చేసినప్పుడు రామ్‌గోపాల్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు అని పక్కాగా వినిపించింది. దీనికి తగ్గట్లుగానే వర్మ ఓ పాటని కూడా తానే స్వయంగా పాడి రిలీజ్ చేశాడు. దీంతో వర్మకే ఈ బయోపిక్ అవకాశం అని అంతా ఫిక్స్ అయిన సమయంలో బాలయ్య తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశం అయ్యింది. వర్మ తర్వాత ఈ బయోపిక్‌ని డైరెక్ట్ చేసే విషయంలో చాలా పేర్లు వినిపించినా, చివరికి మాత్రం తేజ పేరే గట్టిగా వినిపిస్తోంది. చూడాలి బాలయ్య ఫైనల్ గా ఏం నిర్ణయం తీసుకుంటారో.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll