హాలీవుడ్

లైంగికంగా వేధించాడంటూ స్టార్ ప్రొడ్యూసర్ పై హీరోయిన్స్

harvey-weinstein2లైంగిక వేధింపులు సినీ పరిశ్రమలో సర్వ సాధారణం అన్నట్లుగా ఈ మధ్యకాలంలో వార్తలు కంటిన్యూగా వస్తున్నాయి. అందుకు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఏదీ మినహాయింపు లేదు. తాజాగా హాలీవుడ్ మూవీ మొఘల్ గా పేరు తెచ్చుకున్న హార్వే వైన్‌స్టీన్ ఈ ఆరోపణలు మొదలయ్యాయి. స్టార్ ప్రొడ్యూసర్‌గా పేరుగాంచిన వైన్‌స్టీన్‌పై అత్యాచార ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రోజు రోజూకూ వైన్‌స్టీన్‌పై ఆరోపణలు చేస్తున్న హీరోయిన్స్ లిస్ట్ పెరుగుతోంది.

నటి కావాలన్న మోజులో సినీరంగంపై ఆసక్తి కనబరిచే అమ్మాయిలను.. వైన్‌స్టీన్ లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు ఉన్నాయి. హీరోయిన్లు ఒక్కొక్కరుగా తాము అనుభవించిన ఇబ్బందులను బయటపెడుతున్నారు. దీంతో వైన్‌స్టీన్‌పై ఒత్తిడి ఎక్కువైంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను వైన్‌స్టీన్ ఖండించారు. ఆయన తరపున లాయర్లు కూడా అదే మాట చెబుతున్నారు. నిర్మాత వైన్‌స్టీన్ ప్రవర్తనపై వరుసగా వస్తున్న ఆరోపణలతో అమెరికా పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు.

వైన్‌స్టీన్ తమను వేధించారని ఫేమస్ హీరోయిన్లు గ్వినిత్ పాల్ట్రో, ఏంజలినా జోలీలు ఆరోపించారు. కొన్ని దశాబ్ధాలుగా వైన్‌స్టీన్ ఇలాగే ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 20 మంది హీరోయిన్లు ఈ ఆరోపణలు చేశారు. వైన్‌స్టీన్ చర్యలు హేయంగా ఉన్నాయని హాలీవుడ్ హీరో బెన్ ఎఫ్లెక్ ట్వీట్ చేశాడు.

తనకు వ్యతిరేకంగా పలువురు హీరోయన్స్ చేసిన ఆరోపణలపై వైన్‌స్టీన్‌ ప్రతిస్పందించాడు. తన ప్రవర్తన చాలా మందికి బాధ కలిగించి ఉంటుందని ఒప్పుకున్న వైన్‌స్టీన్‌, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. పరస్పర అంగీకారం లేకుండా ఎవరితోనూ సెక్స్‌లో పాల్గొనలేదని స్పష్టం చేశాడు.

ఒక్క హాలీవుడ్‌నే కాదు.. వైన్‌స్టీన్ వల్ల అమెరికా రాజకీయాల్లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. డెమోక్రాట్లకు వైన్‌స్టీన్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డెమోక్రటిక్ నేతలు హిల్లరీ క్లింటన్.. బరాక్ ఒబామాతోనూ వైన్‌స్టీన్‌కు లింకులు ఉన్నాయి. గత అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం కోసం క్లింటన్‌కు భారీ స్థాయిలో వైన్‌స్టీన్ నుంచి విరాళాలు అందాయి. అయితే ఈ అంశంపై హిల్లరీ క్లింటన్ స్పందించారు. వైన్‌స్టీన్ ఇచ్చిన విరాళాలను మొత్తంగా ఛారిటీకి డొనేట్ చేయనున్నట్లు హిల్లరీ చెప్పారు.

వైన్‌స్టీన్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండడంతో హాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైన్‌స్టీన్.. మానసికంగానూ ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తున్నది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రాజు గారి గది 2 OCT 13
రాజా ది గ్రేట్ OCT 18
ఉన్నది ఒకటే జిందగీ OCT 20
నెక్స్ట్ నువ్వే NOV 03
లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21

Poll