టాలీవుడ్

మళ్లీ అదే సీన్: పవన్‌ కల్యాణ్‌ ఇంటి ముందు జ్యోతి హంగామా

Pawan-Kalyan-Katamarayudu-Movie-Stills-31ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలవాలంటూ బుధవారం ఓమహిళ జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లోని ఆయన ఇంటి ముందు హంగామా సృష్టించింది. జ్యోతి అనే సదరు మహిళను లోపలికి వెళ్లనివ్వకుండా పవన్‌ ఇంటి వద్ద ఉన్న సిబ్బంది అడ్డుకుని జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో పవన్‌కల్యాణ్‌ ఇంట్లోలేరు. అయితే, ఆమె గతంలోనూ చాలాసార్లు పవన్‌ కల్యాణ్‌ను కలవాలంటూ ఆయన ఇంటి ముందు హంగామా సృష్టించిందని.. మానసిక పరిస్థితి సరిగాలేకే ఇలాచేస్తోందని పోలీసులు తెలిపారు.

గతంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘తానూ పవన్ కళ్యాణ్ అభిమానిని, తన కష్టాలు పవన్ తో చెప్పుకుంటే పరిష్కారం అవుతుందని తెలిసి కలవాలని వచ్చానని, కానీ, ఆయన పిఏ పవన్ ను కలవకుండా చేస్తున్నారని’ మీడియా వర్గాలతో ఆవేదన వ్యక్తం చేస్తూ… అంతేకాదు ‘తాను పవన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు’ తెలపడంతో, ఆమె మానసిక పరిస్థితులపై అనుమానం వచ్చి, సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందివ్వడంతో, రంగప్రవేశం చేసిన పోలీసులకు ఆమె షాక్ ఇచ్చేలా ప్రవర్తించింది.

పవన్ కళ్యాణ్ ఇక్కడ లేరని చెప్పినా వెనక్కి తగ్గని జ్యోతి, తానూ ఎలాంటి న్యూసెన్స్ చేయకపోయినా, తనపై పోలీసులు దాడి చేసారని, అసభ్యకరంగా మాట్లాడారని, ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అంటూ పోలీస్ వారిపై కూడా మండిపడింది. అయితే కొంత సమయం తర్వాత జ్యోతికి నచ్చచెప్పి స్టేషన్ కు తరలించారు. దీంతో అర్ధరాత్రి పవన్ ఇంటి ముందు జరిగిన హైడ్రామా తెల్లారేపాటికి ప్రధాన వార్తగా మారిపోయింది. ఇప్పుడు మరోసారి ఈ సీన్ రిపీట్ అయ్యింది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll