టాలీవుడ్

పవన్, సన్నిలియోన్ …ఎవరికి మీ హగ్?

పవన్ కళ్యాణ్ ని సోషల్ మీడియాలో విమర్శించటమే పనిగా పెట్టుకున్నట్లున్న రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వ్యంగ్యాస్త్రాలు వదిలారు. అయితే ఈ సారి కాస్త శృతిమించినట్లే అనిపించింది. సన్నిలియోన్ తో పవన్ ని పోలుస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే…లండన్ టూర్ నుంచి పవన్ హైదరాబాద్‌కు సోమవారం వచ్చారు. ఆ సమయంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు విరివిగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు హాజరై ఘన స్వాగతం పలికారు.

దీనిపై స్పందించిన వర్మ.. పవన్‌ని సన్నీలియోన్‌తో పోలుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీతో సన్నీలియోన్ కలిస్తే వీరి కలయిక సూపర్ హిట్ అవుతుందంటూ పేర్కొన్నారు. వరుసగా 4 ట్వీట్లతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి పవన్, సన్నీ, వర్మ ముగ్గురూ ఒకే ఫోజులో ఉన్న పిక్‌ని జత చేశారు. వర్మ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…

“సన్నీలియోన్‌కి పవన్ కల్యాణ్ కన్నా ఎక్కువ జనం వస్తున్నారంటే ఎవరిని పుట్టించిన ఏ అమ్మలో ఏ బిడ్డ తప్పుందో ఏ అమ్మకి కూడా తెలియదని ప్రతి నాన్నకు తెలుసని అర్థం. వచ్చే ఎన్నికల్లో సన్నీలియోన్ పవన్ కల్యాణ్ కలయిక తిరుగులేని రాజకీయ ఎత్తుగడ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం.. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు విధాలుగా ప్రజలకు వేరు వేరు ఎంటర్‌టైనింగ్ సుఖాలు ఇచ్చారు.

పవన్ కల్యాణ్‌కి ఉన్న లక్షల ఫ్యాన్స్‌కి.. సన్నీలియోన్‌కి.. పవన్ కల్యాణ్‌కి మధ్య ఒకరికే హగ్ ఇచ్చే అవకాశం వస్తే ఎవరిని హగ్ చేసుకుంటారా అన్నది పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా నా ప్రశ్న. జనసేన/జనసేవ పార్టీతో పవన్ కల్యాణ్/సన్నీలియోన్ కలయిక సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే వారిద్దరు జనాన్ని ఆకట్టుకుంటారు.”

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2