టాలీవుడ్

నిన్ను రేప్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం…రెడీగా ఉండు

parvathiమళయాళ నటి భావన లైంగిక దాడి,కిడ్నాప్ వ్యవహారం మరువక ముందే.. మరో మళయాల నటి పార్వతి అదే తరహాలో లైంగిక వేధింపులకు గురవ్వటం అందరికీ షాక్ కు గురి చేసింది. మళయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించిన కసాబా చిత్రంపై పార్వతి ఇటీవల వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై వివాదం నెలకొంది. దీంతో ఆమెను సోషల్ మీడియాలో మమ్ముట్టి ఫ్యాన్స్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో ఆమెను వేధిస్తున్నారు.

తాజాగా నిన్ను రేప్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం,రెడీగా ఉండు అంటూ వచ్చిన మెసేజ్ పై అందరూ షాక్ కు గురి అయ్యారు. కేరళకు చెందిన రాజన్ అనే వ్యక్తి ఈ మసేజ్ పంపారు. అయితే ఇలా అనటానికి కారణం..ముమ్మట్టి సినిమాపై ఆమె కామెంట్స్ చేయటమే.

మమ్ముట్టిపై చేసిన కామెంట్స్‌కు బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పకుంటే దారుణంగా అత్యాచారం చేస్తామని బెదిరించటంతో పోలీస్ లు రంగంలోకి దిగారు.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ వేదికగా పార్వతి, మమ్ముట్టి మధ్య వివాదం మొదలైంది. ఈ చిత్రోత్సవంలో పార్వతి మాట్లాడుతూ..ముమ్మట్టి నటించిన కసాబా టైటిల్‌ను డైరెక్ట్ గా చెప్పకున్నా.. ఆ సినిమాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. వేదికపై ఉన్న మరో నటి గీతూ మోహన్‌దాస్ ఆ సినిమా పేరు చెప్పమని బలవంతంగా చేయటంతో చివరకు పార్వతి కసాబా చిత్రం పేరు వెల్లడించటంతో వివాదం పెద్దదైంది.

ఈ విషయమై ఇప్పటికే పార్వతి పై మమ్ముట్టి ఫ్యాన్స్, కొందరు సినిమా పరిశ్రమ పెద్దలు మండిపడ్డారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తోటి నటుడి సినిమాపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమేంటని, పెద్దలను గౌరవించడం తెలుసుకోవాలని పార్వతిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇంకొందరు అయితే మరో అడుగు ముందుకు వేసి…రేప్ చేస్తాం. సారీ చెప్పకపోతే చంపేస్తాం. దారుణంగా లైంగిక దాడి చేస్తాం. నడువడానికి చాలా కష్టపడాలి. మేం లైంగిక దాడి చేస్తే పీరియడ్ కూడా రాకుండా దెబ్బతింటుంది అని నటి పార్వతిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై మమ్ముట్టి మౌనం వహించడంతో ఇప్పుడు వేధింపుల వివాదం అతని మెడకు చుట్టుకుంటోంది.

పార్వతి, మమ్ముట్టి వివాదంపై కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ స్పందించారు. ఈ వివాదంలో పార్వతిపై సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని సైబర్ పోలీసులకు మంత్రి సూచించారు. ఎవరైనా తన అభిప్రాయాన్ని చెబితే ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. ఎంతో ప్రతిభావంతురాలైన పార్వతిపై అభ్యంతరమైన వ్యాఖ్యలు చేయడం తగదు అని మంత్రి థామస్ విచారం వ్యక్తం చేశారు

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16