కోలీవుడ్

వాట్సప్ లో బెదిరింపులు,ఈ గొడవ ఎంతదాకా వెళ్తుందో

vishalఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌ కందువడ్డీ వ్యవహారంలో హీరో విశాల్‌ ఆవేదనతో రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనకు వాట్సాప్‌ ద్వారా బెదిరింపులు వస్తున్నాయి.ఇటీవల సహ నిర్మాత అశోక్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారు.. ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌ అనుచరుల బెదిరింపులతోనే తాను చనిపోతున్నట్లు సూసైడ్‌ నోట్‌ రాశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సంఘటనతో స్పదించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌.. కందువడ్డీ బాధిత నిర్మాతలు ఎవరైనా ఉంటే తన సంఘానికి ఫిర్యాదు చేయాలని కోరారు. దీంతో అన్బుచెళియన్‌ తరపు వారు వాట్సాప్‌ ద్వారా జాతి, మత విద్వేశాలు ప్రేరేపించేలా బెదిరింపులు చేస్తున్నారని ఆయన తెలిపారు. అన్బెచెళియన్‌ కుల, మత భేదాలతో కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి విద్వేష చర్యలను తమిళనాడులో వ్యాపించనీయరాదని అన్నారు.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే..

కొద్ది రోజులు క్రితం ప్రముఖ తమిళ దర్శక, నిర్మాత బి.అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని అళ్వార్‌ తిరునగర్ లోని తన నివాసంలో ఆయన మరణించారు. గత ఏడేళ్లుగా ఆయన సినిమాలకు ఫైనాన్సియర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తులు తమ డబ్బులు తిరిగివ్వాల్సిందిగా బెదిరిస్తుండటమే ఈ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. అశోక్ కుమార్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత శశికుమార్ కు బంధువు. శశికుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ఇసన్, పొరలి సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. వీరి నిర్మాణంలో తెరకెక్కిన కోడి వీరం రిలీజ్ సిద్ధంగా ఉంది.

ఈ విషయంపై తమిళ ఫిల్మ్ ప్రొడ్యూజర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, హీరో విశాల్ తీవ్రస్థాయిలో స్పందించారు. పరిశ్రమలో ఇదే ఆఖరి బలన్మరణం కావాలని, ఎక్కువ వడ్డీకి అప్పులిచ్చి నిర్మాతల్ని వేదించే ఫైనాన్షియర్ల ఆగడాలు ఇక సాగవని, అలాంటి వారెవరైనా ఉంటే పద్దతిని మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. అంతేగాక అశోక్ కుమార్ మరణాన్ని హత్యగా భావించి సదరు ఫైనాన్షియర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్నప్తి చేశారాయన.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

ఆక్సిజన్ NOV 30
జవాన్ DEC 1
MCA DEC 21
హలో DEC 22
చలో DEC 29

Now Showing

బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17
లండన్ బాబులు 17 NOV 17
గృహం NOV 10
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll