బాక్స్ ఆఫీస్

‘బాహుబలి 2’ ని బీట్‌ చేసి,షాకిచ్చిందీ సినిమా

baahubaliప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రాన్ని మాధవన్‌ చిత్రం దాటేయటం ఇప్పుడు అందటా ఆశ్చర్యంగా మారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దక్షిణ చిత్ర పరిశ్రమ నుంచి ఐఎండీబీ (ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌) 2017 టాప్‌ 10 ఇండియన్‌ చిత్రాల జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో ఆర్‌.మాధవన్‌ నటించిన ‘విక్రమ్‌ వేద’ మొదటిస్థానంలో ఉండగా.. ప్రభాస్‌, రానా నటించిన ‘బాహుబలి 2’ రెండో స్థానంలో ఉంది. విజయ్‌ దేవరకొండ నటించిన ‘అర్జున్‌ రెడ్డి’ తృతీయ స్థానంలో నిలిచింది. ఈ మూడు చిత్రాలు విమర్శకుల చేత కూడా ప్రశంసలందుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించాయి.

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’, ఇర్ఫాన్‌ఖాన్‌ చిత్రం ‘హిందీ మీడియం’ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. రానా నటించిన మరో చిత్రం ఘాజీ కూడా ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. ఇక ‘కిలాడీ’ అక్షయ్‌కుమార్‌ నటించిన రెండు చిత్రాలు ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా’, ‘జాలీ ఎల్‌ఎల్‌బీ2’ ఈ జాబితాలో ఉన్నాయి. ఇక టాప్‌ 10లోని చివరి రెండు స్థానాల్లో ఇళయదళపతి విజయ్‌ నటించి ‘మెర్సెల్‌’, మమ్ముట్టి మలయాళ చిత్రం ‘ది గ్రేట్‌ ఫాదర్‌’ ఉన్నాయి.

బాలీవుడ్‌ నుంచి షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ నటించిన చిత్రాలు టాప్‌ 10లో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. ఈ ఏడాది షారుఖ్‌ నటించిన ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’, సల్మాన్‌ నటించిన చిత్రం ‘ట్యూబ్‌లైట్‌’ ప్రేక్షకులను నిరాశపరచటమే అందుకు కారణం.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16