టాలీవుడ్

విక్రమ్ కు ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్,పెద్ద దెబ్బే

 

vikramప్రస్తుతం విక్రమ్ మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకటి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధ్రువ నక్షతం’ కాగా.. మరొకరి ‘సామి 2’.. విజయ్ చందర్ దర్శకత్వంలో ‘స్కెచ్’ అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ముందుగా ‘స్కెచ్‌’ రిలీజ్ కానుంది. ‘స్కెచ్‌’ సంక్రాంతికి బరిలో దిగడానికి విక్రమ్‌ ప్లాన్ వేస్తున్నారు.

అయితే తెలుగులో ‘స్కెచ్’ రిలీజ్ కు సమస్య లు ఖచ్చితంగా వస్తాయి. తెలుగులో విక్రమ్ కు మంచి మార్కెట్ ఉన్నా..వరస ఫ్లాఫులతో అది తగ్గింది. దానికి తోడు డబ్బింగ్ సినిమాలను సంక్రాంతికు రిలీజ్ కానివ్వకూడదని నిర్మాతలు నిర్ణయింతీసుకున్నట్లు సమాచారం. అలాగే ఎలాగోలా చేద్దామనుకున్నా థియోటర్స్ సమస్య వస్తుంది. తెలుగులోనే పెద్ద సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి.

పోనీ సంక్రాంతికి ప్రక్కన పెట్టి తర్వాత రిలీజ్ చేద్దామంటే ఖచ్చితంగా తమిళంలో హిట్ టాక్ తెచ్చుకుని ఉండాలి. లేకపోతే ఇక్కడ రిలీజ్ అయ్యినా పెద్దగా క్రేజ్ ఉండదు. ఇవన్నీ కాదని సంక్రాంతికి తమిళంలో కూడా ఆపుదామంటే అంత పెద్ద పండగను మిస్ చేసుకున్నట్లే . దాంతో రిలీజ్ డేట్ ప్రకటించినా విక్రమ్ టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇరుముగన్‌ చిత్ర పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో విక్రమ్‌ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సూరి, ఆర్‌కే.సురేశ్, అరుళ్‌దాస్, మలయాళం నటుడు హరీశ్, శ్రీమాన్, మధుమిత, విశ్వాంత్, వినోద్, వేల్‌ రామమూర్తి, సారిక తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

వీరితో పాటు నటి ప్రియాంక కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్‌.ధాను వీ.క్రియేషన్స్‌ సమర్పణలో మూవింగ్‌ ఫ్రేమ్‌ సంస్థ నిర్మిస్తోంది. విజయ్‌చందర్‌ కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌.థమన్‌ సంగీతం, సుకుమార్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ థాను , మూవింగ్ ఫ్రేమ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విక్రమ్ గత చిత్రం ‘ఇరుముగన్’ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడటంతో.. విజయం కోసం చూస్తున్న విక్రమ్ కు ఈ చిత్రం విజయాన్ని ఇస్తుందేమో ఆశిస్తున్నాడు!

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

ఒక్క క్షణం DEC 28
అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll