టాలీవుడ్

నమ్మచ్చా..లేక ఇదీ ఆ టైప్ రూమరేనా?

Mahesh Babu (7)1505493182సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు దాన్ని మరిపించేందుకు మీడియాలో రకరకాల వార్తలు ప్రత్యక్షమవుతూంటాయి. అలాంటి వాటిల్లో మొదట స్ప్రెడ్ అయ్యే రూమర్… అదే హీరోతో అదే దర్శకుడు రిపీట్ చేస్తున్నాడని. అంత ధైర్యంగా అదే హీరో మళ్లీ అదే దర్శకుడుని కంటిన్యూ చేస్తున్నాడంటే ..తాజాగా చేసిన చిత్రం సూపర్ హిట్ అని జనం నమ్ముతారని …ఆ రూమర్స్ క్రియేట్ చేసినవారి ఆశయం అవుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే… నిన్నటి నుంచి మీడియాలో ఒకటే రచ్చ… ఆ న్యూస్ ఏమిటంటే… మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘స్పైడర్’ చిత్రం విజయం తర్వాత దర్శకుడు ఎఆర్ మురుగదాస్ మరో క్రేజీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే తమిళంలో విజయ్ తో తుపాకి, కత్తి చిత్రాలు తీసిన మురుగదాస్, మరోసారి విజయ్ తో చిత్రాన్ని తీసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమాలో మహేస్ బాబు విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే చిత్రం తెలుగులో మహేష్ హీరోగా, విజయ్ విలన్ గా నటించనున్నారట.

ఈ వార్త మొదట సోషల్ మీడియాలో ఆ తర్వాత వెబ్ మీడియాలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరోసారి ఓ మంచి సోషల్ మెసేజ్ తో కమర్షియల్ చిత్రాన్ని తెరకెక్కించడానికి మురుగదాస్ అడుగులు వేస్తున్నారు.

దీనికి సంబంధించి ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ వీరిద్దరీ ఓ స్టోరీ లైన్‌ వినిపించారని కోలీవుడ్‌ సమాచారం. తెలుగులో విజయ్‌ ప్రతినాయకుడిగా, తమిళంలో మహేష్‌బాబు ప్రతినాయకుడిగా ఉండేలా ఓ కథను మురుగదాస్‌ ఇద్దరికీ వినిపించాడని.. అయితే దీనిపై వారు ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆయన చెప్పిన కథ నచ్చి చిత్రం పట్టాలెక్కితే మాత్రం.. సినీ అభిమానులకు కొత్త తరహా అనుభూతి ఖాయం. మహేష్‌, విజయ్‌ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి!

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll