బాక్స్ ఆఫీస్

బంద్ పూర్తైంది : ‘ఏ మంత్రం వేశావే’ రిలీజ్ డేట్ ఫిక్సైంది

డిజిటల్‌ ప్రొవైడర్స్‌ వసూలు చేస్తున్న ఛార్జీలకు నిరసనగా ఐదు రాష్ట్రాల చిత్ర పరిశ్రమ ఐక్య కార్యాచరణ సమితి మార్చి 2 న బంద్ ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే. దీంతో వారం రోజుల నుండి ఇటు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ‌ల‌తో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలలో థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. దీంతో సినీ ల‌వ‌ర్స్ దిగాలుగా ఉన్నారు. ఈ రోజు జ‌రిగిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో బంద్ విర‌మ‌ణ చేసిన‌ట్టు తెలుస్తుంది. రేప‌టి నుండి అన్ని థియేట‌ర్స్‌లో సినిమాలు ప్ర‌ద‌ర్శితం కానున్న‌ట్టు స‌మాచారం. ఈ నేపధ్యంలో విజయదేవరకొండ తాజా చిత్రం థియోటర్స్ కు రాబోతోంది.

వివరాల్లోకి వెళితే..పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యువతలో విజయ్ దేవరకొండ సంపాందించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ యువతలో మోస్ట్ క్రేజీయస్ట్ హీరోగా మారాడు. ఇక ఈ యువహీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ఏ మంత్రం వేశావే’. విజయ్ సరసన శివానీసింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. గోలీసోడా ఫిలిమ్స్ నిర్మాణంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని మార్చి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు.

”గేమింగ్ అతని ప్రపంచం. గాడ్జెట్స్ అతని జీవితం. ఇన్సెన్సిటివ్, ఇర్రెస్పాన్సిబుల్” అంటూ ఓ యువతి చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. అమ్మాయిలంటే తనకు కేవలం ఆటబొమ్మలేనని, వారితో తాను ఆడుకుంటానని ”గర్ల్స్ ఆర్ జస్ట్ లైక్ టాయ్స్. ఐ కెన్ ప్లే గేమ్స్ విత్ దెమ్” చెప్పే డైలాగ్ యూత్ మధ్య క్రేజ్‌ను సంపాదించుకుంటోంది. అలాగే ”డోంట్ నో ఎబౌట్ లవ్. బట్ షీ మేక్స్ మీ ఫీల్ సమ్ థింగ్ ఇన్ సైడ్” వంటి డైలాగులతో ట్రైలర్ చాలా ఇన్నోవేటివ్ గా ఉంది.

సమర్పకుడు మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ …గేమ్ నేపథ్యంలో నడిచే విభిన్నమైన కథ ఇది. విజయ్ దేవరకొండ పాత్ర ఇందులో చాలా వైవిధ్యంగా, నేటి యువతరానికి ప్రతినిథిగా కనిపించబోతున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి తరహాలోనే ఈ చిత్రం కూడా ఆయన కెరీర్‌లో మరపురాని చిత్రంగా వుండబోతుంది. విదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా వుంటాయి. మార్చి 9న చిత్రాన్ని విడుదల చేస్తాం అని తెలిపారు. శివన్నారాయణ, రాజబాబు, నీలాక్షిసింగ్, ఆశిష్‌రాజ్, ప్రభావతి, దీపక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అబ్భత్ సమత్, సినిమాటోగ్రఫీ: శివారెడ్డి.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2