టాలీవుడ్

ట్రైలర్ చూస్తూంటే ‘బిచ్చగాడు’ లాగే హిట్ అయ్యేలా ఉంది

విజయ్ ఆంటోని హీరోగా నటించిన తమిళ చిత్రం అన్నాదురై. జి.శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డైనా చంపిక, మహిమ, జ్వెల్ మ్యారీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇంద్రసేన పేరుతో రాధిక శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని తెలుగులో అందిస్తున్నారు. ఈ చిత్ర టైలర్ ని విడుదల చేశారు. ఇందులో ఓ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే వివిధ సంఘటనల గురించి వివరిస్తున్నారు.

‘నేరుగా వెళ్లి రైట్‌ తీసుకుంటే ఒక ఓటమి ఎదురౌతుంది.. దాన్నుండి లెఫ్ట్‌కి వెళితే పెద్ద నమ్మక ద్రోహం కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్లి యూటర్న్‌ తీసుకుంటే నువ్వు తీసుకున్న అప్పు అనే లోయ కనిపిస్తుంది. ఆ లోయలోపడి ముక్కు, ముఖం పగలగొట్టుకుని లేచి ముందుకెళ్తే మనం మోసపోయామనే ఒక సిగ్నల్‌ పడుతుంది. ఆ సిగ్నల్‌ని కూడా టాప్‌ గేర్‌ వేసి దాటి వెళితే ఆ తర్వాత వచ్చే ఇల్లే నువ్వు కోరుకున్న విజయం. ఆ విజయాన్ని అందుకుని వెనక్కి తిరిగి చూస్తే యముడు మనకన్నా ముందొచ్చి మనకోసం నిల్చుని ఉంటాడు’ అంటూ ఇంట్రస్టింగ్ గా ఈ ట్రైలర్‌ సాగింది. డిసెంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రాధిక మాట్లాడుతూ … ఇంద్రసేన చక్కని భావోద్వేగాల నేపథ్యంలో సాగే చిత్రం. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

రాధికగారితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం మాకు కలిసివచ్చే అంశం. కొత్త పంథాలో తెరకెక్కుతున్న ఈ సినిమా అందరికి నచ్చుతుందనే నమ్మకముంది అని హీరో విజయ్ ఆంటోని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ ద్విపాత్రాభినయం చేశారు. ఈ రెండు పాత్రల వెనుక ఓ రహస్యం వుంది. అది ఏమిటనేది సినిమాలో చూడాల్సిందే అన్నారు. ఈ కార్యక్రమంలో భాషశ్రీ, డైనా చంపిక, మహిమ, ఫాతిమా, లైన్ ప్రొడ్యూసర్ సాండ్రా తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రాజు గారి గది 2 OCT 13
రాజా ది గ్రేట్ OCT 18
ఉన్నది ఒకటే జిందగీ OCT 20
నెక్స్ట్ నువ్వే NOV 03
లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21

Poll