టాలీవుడ్

‘ఒక్క క్షణం’డైరక్టర్ కు అడ్వాన్స్ ఇచ్చిన భారీ నిర్మాత,హీరో ఎవరంటే

okka-kshnam-vi-anandనిఖిల్ తో ఎక్కడికి పోతావ్ చిన్నవాడా చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న వి. ఐ ఆనంద్. రీసెంట్ గా అల్లు శిరీష్ తో …‘ఒక్క క్షణం’ సినిమా చేసారు. రెండు రోజుల క్రితం రిలీజైన ఈ చిత్రం కలెక్షన్స్ సంగతి ప్రక్కన పెడితే మంచి టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ డైరెక్టర్ దర్శకత్వం లో చేయటానికి యంగ్ హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. మరో ప్రక్క గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త ఫిలిం సర్కిల్లో ప్రచారం అవుతోంది. దాంతో ఈ దర్శకుడు ఏ హీరోకు తదుపరి చిత్రం కమిటయ్యాడనేది సస్పెన్స్ గా మారింది.

అయితే ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం …అన్ని కుదిరితే అల్లు అర్జున్ తోనే ఆనంద్ తదుపరి చిత్రం చేయనున్నారు. అదీ గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ మూవీ నిర్మాణం జరగనుంది. ఈ మేరకు రీసెంట్ గా ఓ సైన్స్ ఫిక్షన్ కథను అల్లు అరవింద్ కు, అల్లు అర్జున్ కు కలిపి వినిపించారని..వెంటనే మరో మాట లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాకుండా ఇరవై లక్షలు అడ్వాన్స్ కూడా ఆనంద్ కు ఇచ్చారని చెప్పుకుంటున్నారు.

ఇక తాజాగా థియేటర్స్ కి వచ్చిన ‘ఒక్క క్షణం’ మంచి రెస్పాన్స్ ను రాబడుతోంది. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే అల్లు శిరీష్ కు హీరో ఇమేజ్ పూర్తిగా రాకపోవటం,డిఫరెంట్ కాన్సెప్టు ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపెడుతోంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16