టాలీవుడ్

ప్రేమ, దోమ, చెత్తాచెదారం అన్ని పక్కనపెట్టి…

విక్టరీ వెంకటేశ్ తాజా చిత్రం గురు టీజర్ రిలీజైంది. అవార్డ్ విన్నింగ్ త‌మిళ్ సూప‌ర్ హిట్ ఫిల్మ్ ఇరుదు సుత్త్ రు చిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రమే విక్ట‌రీ వెంక‌టేష్ తాజా చిత్రం. ఈ చిత్రానికి సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్ కోచ్ గా న‌టిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది.

బాక్సింగే తన ప్రపంచమని ‘గురు’ టీజర్‌లో విక్టరీ వెంకటేశ్‌ అంటున్నారు. బుధవారం ‘గురు’ చిత్రం కొత్త టీజర్‌ను విడుదల చేశారు. ‘మీరు నేను చెప్పిందే వింటారు.. చెప్పిందే తింటారు. ఇల్లు, వాకిలి, ప్రేమ, దోమ, చెత్తాచెదారం అన్ని పక్కనపెట్టి ఒళ్లొంచి ట్రై చేయండి’ అని టీజర్‌లో వెంకీ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ టీజర్‌ వీడియోను వెంకటేశ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు.

‘ఈ చిత్రం వెంకీ సినీ కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలుస్తుంది, వెంకీ ఈజ్‌ బ్యాక్‌, సూపర్‌ వెంకీ సర్‌, చక్కగా ఉంది, చిత్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం..’ అని ఫ్యాన్స్‌ యూట్యూబ్‌లో కామెంట్స్‌ చేశారు. ‘సాలా ఖడూస్‌’ అనే బాలీవుడ్‌ చిత్రానికి రీమేక్‌గా సుధ కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఈ చిత్రంలో ముంతాజ్‌ సర్కార్‌, నాజర్‌, తనికెళ్ళభరణి, జాకీర్‌హుస్సేన్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. వై నాట్‌ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌.శశికాంత్‌ నిర్మిస్తున్న ఈచిత్రానికి సంగీతం : సంతోష్‌ నారాయణన్‌, సినిమాటోగ్రఫీ : కె.ఎ.శక్తివేల్‌, ఎడిటింగ్‌ : సతీష్‌సూర్య, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జాకీ, పాటలు : రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్‌, శ్రీమణి, సంభాషణలు : హర్షవర్థన్‌, స్టంట్స్‌ : స్టన్నర్‌ శ్యామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : చక్రవర్తి రామచంద్ర.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16