టాలీవుడ్

హిట్ కోసం వెంకీ..’గాఢ్ ఫాధర్’ తో గేమ్

Venkatesh-Stills-At-Guru-Interview-07మొదటినుంచీ వెంకటేష్ రీమేక్ లతో విజయపధంలో దూసుకువెళుతున్నారు. వెంకీ కెరీర్‌లో ఇప్పటి వరకూ దాదాపు డడ్బ్బై సినిమాలు చేస్తే.. వాటిల్లో ముప్పై సినిమాలు రీమేక్ సబ్జెక్టులే కావటం విశేషం! తన సక్సెస్‌ రేట్‌ పెంచుకోవడానికి రీమేక్‌ మూవీస్‌లో నటించడానికే ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు. రీసెంట్ గా గురు అనే రీమేక్ చిత్రం చేసి హిట్ కొట్టిన ఆయన ఇప్పటివరకూ ఏ కొత్త సినిమా కమిటవ్వలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఓ రీమేక్ ని ఓకే చేసినట్లు తెలుస్తోంది.

ఈ సంవత్సరం మొదట్లో ముమ్మట్లి హీరోగా వచ్చి మలయాళంలో ఘనవిజయం సాధించిన గాడ్ ఫాధర్ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి రీమేక్‌ చేసి హిట్‌ కొట్టేప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రంలో ముమ్మట్టి చేసిన పాత్ర వెంకటేష్ కు బాగా నచ్చినట్లు చెప్తున్నారు. తమ కుమార్తెని దారుణంగా రేప్ చేసినవాళ్లపై ఓ తండ్రి ఎలా పగ తీర్చుకున్నాడనే రివేంజ్ సబ్జెక్ట్ తో ఈ చిత్రం తయారైంది. ప్రస్తుతం ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయి. అన్ని కుదురితో నిర్మాత, దర్శకుడుతో ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

వెంకటేష్… టాలీవుడ్‌లో చేస్తున్న స్ట్రైయిట్ సినిమాలను ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు. దీంతో ఇతర భాషల్లో హిట్ అయిన కథలను టాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. తను ఫాలో అవుతున్న ఈ సేఫ్‌ ఫార్ములాతో అటు సక్సెస్‌ సాధిస్తున్నారు. ఇటు యూత్‌లో క్రేజ్‌ను పెంచుకుంటున్నారు. అందుకే మరోసారి ఆయన రీమేక్ వైపు దృష్టి పెట్టారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గాఢ్ ఫాదర్ సినిమా తప్పకుండా టాలీవుడ్‌ ప్రేక్షకులకు నచ్చుతుందని వెంకీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll