బాక్స్ ఆఫీస్

‘తొలిప్రేమ’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్, ఓవర్ సీస్ పరిస్దితి ఏంటి

 

Varun-Tej-Tholiprema-Movie-Poster-3సినీ అభిమానులను మరోసారి ‘ఫిదా’ చేసేసాడు వరుణ్ తేజ్. రాశీ ఖన్నాతో కలిసి ‘తొలిప్రేమ’ శనివారం నాడు థియేటర్స్‌లో సందడి చేసేందుకు వచ్చేసి దుమ్ము దులిపేస్తున్నాడు వరుణ్ తేజ్. ‘తొలిప్రేమ’ టైటిల్ తోటే క్యూరియాసిటి పెంచేసిన వరుణ్.. టీజర్, ట్రైలర్‌లతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాడు. దాంతో కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. ఓవర్సీస్ నుండి ‘తొలిప్రేమ’కు అద్భుతమైన పాజిటివ్ రిపోర్ట్ రావటం బాగా కలిసొచ్చింది.

మొదటి రోజు నుంచే హిట్ టాక్ రావటంతో 5 కోట్ల షేర్ ని తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ప్రపంచ వ్యాప్తంగా 9.26 కోట్ల షేర్ ని రాబట్టింది. ఓవర్ సీస్ విషయానికి వస్తే… గ‌తేడాది ఫిదా సినిమాతో ఏకంగా అక్క‌డ 2 మిలియ‌న్ మార్క్ అందుకున్న వ‌రుణ్ తేజ్.. ఇప్పుడు అక్క‌డ హాఫ్ మిలియ‌న్ దాటేసి.. మిలియ‌న్ వైపుగా అడుగేస్తుంది. ఓవ‌ర్సీస్ లో మూడు రోజుల్లో 5 ల‌క్ష‌ల డాలర్ల పైన వ‌సూలు చేసింది తొలిప్రేమ‌. వ‌రుణ్ తేజ్ లాంటి మీడియం రేంజ్ హీరోకు ఇది చాలా ఎక్కువ క‌లెక్ష‌న్లు అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అక్కడ ఈజీగా 1.3 మిలియ‌న్ వ‌ర‌కు వ‌సూలు చేయ‌డం ఖాయం అంటున్నారు.

ఏరియాల వారీగా ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

నైజాం – 2.3 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.86 కోట్లు
ఈస్ట్ – 0.48 కోట్లు
వెస్ట్ – 0.44 కోట్లు
కృష్ణా – 0.53 కోట్లు
గుంటూరు – 0.62 కోట్లు
నెల్లూరు – 0.23 కోట్లు
సీడెడ్ – 0.73 కోట్లు
నైజాం ప్లస్ ఏపీ – 6.96 కోట్లు
యూఎస్ – 2.30 కోట్లు
రెస్టాఫ్ ఏరియాస్ – 0.75 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా తొలి వీకెండ్ కలెక్షన్స్ – 9.26 కోట్లు

అయితే ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 24 కోట్లు రావాలి. వ‌చ్చే వారం ఒక్క అ.. త‌ప్ప పెద్ద సినిమాలేవీ లేకపోవటం కలిసొచ్చే అంశం. దాంతో ఈజీగా తొలిప్రేమ‌తో వ‌రుణ్ తేజ్ కు మ‌రో భారీ విజ‌యం ద‌క్కిన‌ట్లే.. అంటున్నారు!

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

tr> tr>
అ! FEB 16
ఆచారి అమెరికా యాత్ర FEB 16
మనసుకు నచ్చింది FEB 16
కిరాక్ పార్టీ FEB

Now Showing

tr> tr>
తొలిప్రేమ FEB 10
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10