టాలీవుడ్

‘అజ్ఞాతవాసి’ స్టోరీ బ్యాక్ డ్రాప్ మళ్లీ అదేనా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ తన 25వ చిత్రంగా నటిస్తున్న సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను నిన్న ఉదయం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ రిలీజ్ అనంతరం ..పవన్ తన కొత్త ట్విట్టర్ ఖాతాలో ఆ సినిమాకు సంభందించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ పెట్టారు.

వాటిని బట్టి…ఈ సినిమా కథలో మేజర్ పార్ట్ వారణాసిలో జరుగుతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. అయితే గతంలో పవన్ ఫ్లాఫ్ చిత్రం తీన్ మార్ సైతం వారణాసిలో షూట్ చేసి ఉండటంతో సెంటిమెంట్ గా ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలంటున్నారు.

ఇక జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాల త‌ర్వాత పవ‌న్ క‌ళ్యాణ్‌- త్రివిక్ర‌మ్ కాంబోలో ఈ మూవీ రూపొందుతోంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాలో పవన్ సరసన నటిస్తున్న హీరోయిన్లలో స్టార్ నటి కీర్తి సురేష్ కూడా ఒకరు. తెలుగులో ఈమె చేస్తున్న మొదటి భారీ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. అందుకే ఆమె ఈ సినిమా కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇప్పటికే డబ్బింగ్ మొదలుపట్టేశారామె. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో ఈ చిత్రం ఆడియో విడుదల జరుపుకుని 2018 జనవరి 10న సినిమా రిలీజ్ కానుంది.

Comments

comments

Teaser

Trailer

Teaser 2

Coming Soon

ఆక్సిజన్ NOV 30
జవాన్ DEC 1
MCA DEC 21
హలో DEC 22
చలో DEC 29

Now Showing

బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17
లండన్ బాబులు 17 NOV 17
గృహం NOV 10
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll