బాక్స్ ఆఫీస్

‘జై లవకుశ’ కలెక్షన్స్…ఎన్టీఆర్ మార్కెట్ స్టామినా

Jr-NTR-Jai-Lava-Kusa-Telugu-Movie-Stills-14జై లవకుశ సినిమా విజయంతో ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరో సారి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరూపితమైంది. సరైన సినిమా పడితే ఎ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో అనేది మరో సారి అందరికి అర్ధమయ్యేలా చేసాడు ఎన్టీఆర్ అని ట్రేడ్ లో లెక్కలు సాక్షిగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కెరియర్ లో అత్యధికంగా మొదటి రోజు కలెక్షన్ సాధించిన సినిమా ఏది అంటే ఇప్పుడు జై లవకుశ నిలవడం విశేషంగా చెప్పాలి. ఇక ఈ సినిమా ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా ఎన్టీఆర్ మార్కెట్ స్టామినాని మరో సారి చూపించింది.

గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రముఖుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా ఈ చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్‌ రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. యూఎస్‌ఏ బాక్సాఫీసు వద్ద 18వ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. బుధవారం 168 లొకేషన్లలో ప్రదర్శించిన (ప్రీమియర్‌ షోలు) ఈ చిత్రం 560,699 డాలర్లు (రూ. 3.64 కోట్లు) రాబట్టినట్లు ట్వీట్‌ చేశారు.

ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.24 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. వారాంతానికి చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌కు చేరువయ్యే అవకాశాలు ఉన్నట్లు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 134 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం వసూళ్లను ‘జై లవకుశ’ అధిగమించి, ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌లో కొత్త రికార్డును సృష్టించేలా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

బాబీ ‘జై లవకుశ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. నివేదా థామస్‌, రాశీఖన్నా హీరోయిన్స్ గా నటించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌ రామ్ నిర్మించారు.

Comments

comments

Trending

Latest

Trailer

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll