బాలీవుడ్

ఇక సినిమా హాళ్లలో జాతీయగీతంతో పాటు అది కూడా…

kumbగత కొంతకాలంగా యూత్ లో దేశభక్తిని పెంపొందించేందుకు థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై ఉత్తర్‌ప్రదేశ్‌ థియేటర్లలో జాతీయగీతం పాటు కుంభమేళా కోసం ఆవిష్కరించిన లోగోను కూడా ప్రదర్శించనున్నారు.

యూపీలోని అలహాబాద్‌లో 2019లో కుంభమేళా జరగనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మతపరమైన ఈ పండగ ప్రాధాన్యాన్ని యువత తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రదర్శించనున్నట్లు ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. కుంభమేళాకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం ఆవిష్కరించిన ఈ లోగోలో కొందరు సాధువులు నీట స్నానం చేస్తూ కనిపిస్తూ ఉంటారు. వారి వెనుక ఆలయాలు, స్వస్తిక్‌ ముద్ర ఉన్నాయి.

చివరిసారిగా 2013లో కుంభమేళా జరగ్గా 10 కోట్ల మంది హాజరయ్యారు. ఈ సారి ఆ సంఖ్య 12 కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ కుంభమేళా ఇటీవలే యునెస్కో గుర్తింపు లభించింది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll