టాలీవుడ్

తప్పే, క్షమాపణ చెప్పిస్తా : ప్రముఖ సింగర్ ఉదిత్‌ నారాయణ్‌

Udit Narayanప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ చాలా బాధపడ్డారు. తన కుమారుడు ఆదిత్య నారాయణ్ రాయ్‌పూర్ విమానాశ్రయంలో ప్రవర్తించిన తీరు సరిగా లేదన్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ స్టాఫ్‌తో తన కుమారుడి ప్రవర్తన తనను దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ విధంగా ప్రవర్తించినందుకు ఆదిత్య చేత క్షమాపణ చెప్పిస్తానని తెలిపారు. ఆయన కుమారుడు ఆదిత్య నారాయణ్‌ ఇటీవల రాయ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌లోలగేజ్‌ విషయమై ఇండిగో అధికారులతో గొడవపడిన సంగతి తెలిసిందే.

‘ముంబయికి రా చూసుకుందాం’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టేశాడు. ఆ తర్వాత సారీ చెప్పి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. నెటిజన్లు ఆదిత్యకు ఇంత పొగరు పనికిరాదంటూ కామెంట్లు గుప్పించారు. ఆ తర్వాత ఆదిత్య.. అధికారులతో గొడవపడుతున్న వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘మీరు తిడితే సాధారణమే కానీ నేనుతిడితే అది బ్రేకింగ్‌ న్యూసా’ అని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఈ వీడియోని డిలీట్‌ చేసేశాడు కూడా. తాజాగా ఈ ఘటనపై ఉదిత్‌ నారాయణ్‌ స్పందించారు. తన కుమారుడి చేత బహిరంగంగా క్షమాపణ చెప్పిస్తానని హామీ ఇచ్చారు.

‘ఆదిత్య నిజంగానే అధికారులతో దురుసుగా ప్రవర్తించాడంటే అది తప్పే. నేను ముంబయికి రాగానే వాడి చేత క్షమాపణ చెప్పిస్తాను. ఇప్పుడు ఆదిత్య చాలా బాధలో ఉన్నాడు. అదీకాకుండా వాడు ఏదో చేయరాని నేరం చేశాడన్నట్లు అందరూ ఆదిత్యనే తిడుతున్నారు. పబ్లిక్‌లో అలా ప్రవర్తించడం తప్పే. కానీ నా ఉద్దేశంలో పొరపాటు చేసిన వాడిని మరింత బాధపెట్టడం కూడా తప్పే.ఎవరో చెప్పేవరకు నాకు ఈ విషయం తెలీదు. అసలు ఆదిత్య అలాంటి వ్యక్తి కాదు. ఒక్కగానొక్క అబ్బాయి కావడంతో నేను నా భార్య దీపా వాడిని పద్ధతిగా పెంచాం. అలాంటి ఆదిత్య ఇలా గొడవపడ్డాడంటే నమ్మలేకపోయాను. మనం కూడా ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి గొడవలు ఎదుర్కొనే ఉంటాం. కానీ ఆదిత్య విషయంలో దురదృష్టవశాత్తు అది వీడియోలో రికార్డ్‌ అయింది’ అని వివరించారు ఉదిత్‌.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll