టాలీవుడ్

‘అజ్ఞాత‌వాసి’ …వాళ్ల కోసం స్పెషల్ షో

aganaపవన్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న ‘అజ్ఞాతవాసి’చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ అంచనాలకు తగినట్లే.. రీసెంట్ గా విడుదలైన ‘అజ్ఞాతవాసి’ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం రేపింది. మరో ప్రక్క ఈ చిత్రంలోని పాటలు విడుదల అయ్యి దుమ్ము రేపుతున్నాయి. సోషల్ మీడియాలో లో ట్రెండీ గా నిలుస్తున్నాయి.

రిలీజ్ కు దగ్గరైన ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేయనున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శక, నిర్మాతలు స్పష్టంచేశారు. శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను చిత్ర నిర్మాత చినబాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కలిశారు. ‘అజ్ఞాతవాసి’ సినిమా చూసేందుకు రావాలని ఆయనను ఆహ్వానించారు.

‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్. ‘కొడకా కోటేశ్వరరావు’ అంటూ పవన్‌ పాడిన పాట విశేషంగా అలరిస్తోంది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

వరస ప్రమోషన్స్ తో జనవరి 10న సినిమా విడుదలయ్యే వరకు ‘అజ్ఞాతవాసి’ హంగామా ఆపు అంతూ లేకుండా కొనసాగడం ఖాయం. జనవరి 9న యుఎస్లో భారీ ఎత్తున ప్రిమియర్ షోలతో ‘అజ్ఞాతవాసి’ మొదలవుతుంది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll