కోలీవుడ్

ఈ విషయంలో త్రిష…తొలి సౌత్ హీరోయిన్ గా రికార్డ్

 

Trisha-Stills-At-UNICEF-Celebrity-Advocate-Press-Meet-1యునిసెఫ్‌ సెలబ్రిటీ న్యాయవాదిగా స్టార్ హీరోయిన్ త్రిష నియమితులయ్యారు. బాలల హక్కుల కోసం పోరాడుతున్న యునిసెఫ్(ఐక్యరాజ్య సమితి బాలల నిధి) సంస్థ తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రచారకర్తగా సినీ నటి త్రిషను ఎంపిక చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లోను రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలకు చేయూత ఇవ్వడం, బాల్య వివాహాలను, బాలలపై లైంగిక వేధింపులను అడ్డుకొనేందుకు త్రిష కృషి చేస్తుందని యునిసెఫ్‌ చీఫ్‌ జాబ్‌ జకారియా ప్రకటించారు.

ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ….. ఈ అవకాశం తనకు మరింత గౌరవాన్ని ఇస్తోందన్నారు. చిన్నారుల విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, రక్షణ వంటి అంశాలపై అవగాహన కలిగించనున్నా. ముఖ్యంగా తమిళనాడు, కేరళలోని పిల్లలకు సంబంధించి స్పందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికిపైగా చిన్నారులతో త్రిష మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా యునిసెఫ్‌ వర్గాలు ఆమెకు జ్ఞాపిక అందజేశాయి.

ఇక ఈ ప్రత్యేకతను సొంతం చేసుకున్న తొలి సౌత్ హీరోయిన్ ఈమే కావడం విశేషం. 38 తమిళ చిత్రాలతో పాటు 64 సినిమాల్లో నటించి దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll