టాలీవుడ్

షాక్ : ‘టైగర్ జిందా హై’ తో ప్ర‌ధాని మోదీకి సంబంధం?

సల్మాన్, కత్రినా కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ఏక్ థా టైగర్’. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ సినిమా తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా దుమ్ము రేపుతోంది. చిత్రం రెండో వారంలో అడుగు పెట్టినా కలెక్షన్లలలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. వీకెండ్ లో ఇంకా కలెక్షన్లు పెరిగినట్లుట్రేడ్ వర్గాలు వారు పేర్కొంటున్నారు. సల్మాన్ నటించిన భజరంగీ భాయిజాన్ రూ. 320 కోట్లు…సుల్తాన్ రూ. 300 కోట్లు..రికార్డును బ్రద్దలు కొడుతోంది అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా రూ. 200కోట్లు దాటిపోయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. స‌ల్మాన్ ఖాన్ ‘టైగ‌ర్ జిందా హై’ చిత్రానికి, భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి మ‌ధ్య ఓ సంబంధం ఉంది. ఈ చిత్రం క‌థ‌కు మోదీ చేపట్టిన ఓ రెస్క్యూ మిష‌న్ ఆదర్శ‌మ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చిత్ర‌ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్ వెల్ల‌డించటం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

2014లో ఇరాక్‌లో చిక్కుకుపోయిన 46 మంది న‌ర్సుల‌ను ఓ మిష‌న్ చేపట్టి సుర‌క్షితంగా భార‌త్ కు తీసుకువ‌చ్చారు. మోదీ అధికారంలోకి వ‌చ్చాక కొన్ని రోజుల్లోనే ఈ మిష‌న్ ప్రారంభ‌మైంది. ఆ మిష‌న్ ఆద‌ర్శంగా తీసుకుని, మోదీ పాల‌నా చాక‌చ‌క్యాన్ని గుర్తిస్తూ ఈ సినిమాను ఆయ‌న‌కు అంకితం చేస్తున్న‌ట్లు అలీ అబ్బాస్ జాఫ‌ర్ తెలిపారు. నిజానికి ఈ సినిమాలో ఒకానొక చోట మోదీ పేరు ప్రస్తావ‌న కూడా తీసుకువ‌చ్చార‌ట‌. కానీ సెన్సార్ వారు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఆ డైలాగులు మార్చిన‌ట్లు జాఫ‌ర్ చెప్పారు.

ఐఎస్‌సీ కమాండర్‌ అబు ఉస్మాన్‌ భారతదేశానికి చెందిన 25 మంది నర్సులను కిడ్నాప్‌ చేయటం, వారిని సల్మాన్ విడిపించటం చుట్టూ కథ తిరుగుతుంది. హాలీవుడ్ యాక్షన్ డైరక్టర్ టామ్ స్ట్రూథర్స్ ఈ ఫిల్మ్‌కు స్టంట్స్ రూపొందించాడు. పాక్‌ ఏజెంట్‌ పాత్రలో కత్రినా నటించింది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll