బాలీవుడ్

రిలీజ్ కాని సినిమాలో సీన్ ట…నిజమనుకుని మీడియా రచ్చ రచ్చ

 

TIGERపూరీ జగన్నాథ్ చిత్రం ‘లోఫర్‌’తో గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దిశా పటాని ఆ సినిమా వర్కవుట్ కాకపోవటంతో ఇక్కడ ఆఫర్స్ ఏమీ పట్టుకోలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసి సక్సెస్ అయింది. ఈ క్రమంలో ఆమెకి – టైగర్‌ ష్రాఫ్ కి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు మొదలయ్యాయి. త్వరలో వీళ్లిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లుగా కొన్ని మీడియా సంస్దలు జ్యోతిషం చెప్పేసాయి. అయితే అది నిజమైందంటూ వాళ్లిద్దరూ దండలు మార్చుకుంటున్న వీడియో, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

బాలీవుడ్‌ జంట టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీ . వీరిద్దరూ కలిసి ‘బేఫిక్రా’ అనే ఆల్బమ్‌లో నటించారు. అప్పటి నుంచి డిన్నర్‌ పార్టీలకు, విహారయాత్రలకు కలిసే వెళుతున్నారు. న్యూ ఇయర్‌ సందర్భంగా శ్రీలంకకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడే వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. టైగర్‌, దిశా దండలు మార్చుకుంటున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని, ఆ ఫొటోలు కేవలం వాళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ‘బాఘి 2’ సినిమాలోనవి అని సమాచారం. ఆ సినిమా క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ అవి అని …మేకింగ్ వీడియోలోవి అలా కట్ చేసి స్ప్పెడ్ చేస్తున్నారని చెప్తున్నారు.

ఇక వీరిద్దరి ప్రేమకు టైగర్‌ తండ్రి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ అంగీకరించినప్పటికీ తల్లి ఆయేషా మాత్రం ఒప్పుకోలేదు. గతంలో దీని గురించి దిశా మాట్లాడుతూ అసలు టైగర్‌ కుటుంబంతో తాను ఎక్కువగా కలవనని చెప్పింది. మరి ఈ రహస్య పెళ్లి గురించి దిశా ఏం చెబుతుందో చూడాలి. తెలుగులో వచ్చిన ‘లోఫర్‌’ సినిమాతో దిశా ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం ఆమె తమిళంలో తెరకెక్కతున్న ‘సంఘమిత్ర’ సినిమాలో నటిస్తోంది. టైగర్‌, దిశా జంటగా నటించిన ‘బాఘి 2’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16