టాలీవుడ్

రామ్ చరణ్,బోయపాటి చిత్రంపై రెండు హాట్ న్యూస్ లు

Ram-Charan-Boyapati-Srinu-Film-Complete-detailsప్రస్తుతం చేస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రం తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంభందించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాము. ఈ సినిమాకు సంగీతం అందించటానికి తమన్ ని సంగీత దర్శకుడుగా ఎంపిక చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఇప్పటికే పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రామ్ చరణ్‌తో, బోయపాటితో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తుందని, ఇద్దరితో హ్యాట్రిక్ అవకాశం కొట్టేసిందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ ప్రాజెక్ట్ లో చరణ్ సరసన రకుల్ ప్రీత్ నటించడం లేదని, పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటిస్తున్న అను ఇమ్మాన్యుయేల్ ఆ ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. బోయపాటి సినిమాలు అంటేనే దాదాపు మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా కూడా మాస్ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కనుందని టాక్. రంగస్థలంలో చెర్రీ మాస్ లుక్‌లో కనిపించి అలరించనున్నారు. మరి ఈ సినిమాలో చెర్రీ లుక్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో DEC 29

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll