కోలీవుడ్

పైరసీ సెట్ ఇంతకు తెగించి,వార్నింగ్ ఇస్తుందని ఎవరూ ఊహించలేదు

తెలుగు, తమిళం, మలయాళం, హాలీవుడ్, బాలీవుడ్… ఏ సినిమా అయినా, రిలీజ్ అయిన రోజే పైరసీ చేయడంలో దిట్టయిన ‘తమిళ్ రాకర్స్’. వాళ్ళు మేం ఫలానా సినిమా మా సైట్ లో పెడతాము అని చెప్పారంటే ఖచ్చితంగా చెప్పిన డేట్ కు ఆ సినిమా వాళ్ల సైట్ లో ప్రత్యక్ష్యం అవుతుందన్నమాట. అంతనమ్మకంగా పనిచేస్తారు వాళ్లు. దాంతో సినిమా సినిమా రిలీజైన రోజు రాత్రికే పైరసీ ప్రింట్ వెబ్ సైట్లో ప్రత్యక్షమవుతున్న పరిస్థితి. ఫలానా రోజు.. ఫలానా సమయానికి పైరసీ ప్రింట్ పెడతామంటూ సోషల్ మీడియాలో ప్రకటన చేస్తే ఆ సినిమా టీమ్ కు ,నిర్మాతకు ఏం చెయ్యాలో అర్దం కాని సిట్యువేషన్.

తాజాగా …వచ్చే నెలలో దీపావళి కానుకగా విడుదలయ్యే విజయ్ సినిమా ‘మెర్సల్’ పైరసీ ప్రింటు తమ వెబ్ సైట్లో పెడతామని అనౌన్స్ చేసిందా వెబ్ సైట్. కాకపోతే రిలీజ్ రోజు కాకుండా 15 రోజుల తర్వాత పైరసీ ప్రింట్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఇప్పుడు సైట్ కు కొన్ని ఇబ్బందులన్నాయని.. వాటిని అధిగమించి త్వరలోనే రీఎంట్రీ ఇస్తామని కూడా ఆ వెబ్ సైట్ వెల్లడించింది. మరి ఇంత ధైర్యంగా ప్రకటన చేసిన వెబ్ సైట్ విషయంలో ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురైంది.

ఇక మూడు విభిన్న పాత్రల్లో విజయ్ నటిస్తున్న మూవీ మెర్సెల్. తెలుగులో అదిరింది పేరుతో తెరకెక్కుతోంది. ఈ పేరుకు తగ్గట్టే మూవీ టీజర్ నిజంగా అదరగొట్టేసింది. 1:15నిమిషాల నిడివితో విజయ్ మూడు క్యారెక్టర్లను కళ్లకు కట్టినట్టుగా చూపించారు డైరెక్టర్ అట్లీ. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌ సరసన సమంత, కాజల్, నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం 6గంటలకు విడుదలైన టీజర్ 24గంటలు గడవక ముందే దాదాపు 10లక్షల వ్యూస్‌ని సాధించి వివేగం రికార్డ్‌ని బద్దలు కొట్టింది. 7లక్షలకు పైగా లైక్స్ సాధించి దూసుకెళుతోంది.

Comments

comments

Trending

Latest

Trailer

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll