టాలీవుడ్

‘సైరా నరసింహారెడ్డి’ టీమ్ పెద్ద స్కెచ్ వేసారే,వర్కవుట్ అయితే బాహుబలే

syra narasimha reddy poster 1మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. . కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చైనాలో తెరకెక్కించనున్నారు. అంతేకాదు చైనాలోనూ ‘సైరా’ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. భారతీయ చిత్రాలకు ప్రస్తుతం చైనాలో మంచి ఆదరణ దక్కుతోంది. ‘బాహుబలి,’ ‘దంగల్‌’, ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’, ‘బజరంగీ భాయ్‌జాన్‌’ వంటి చిత్రాలు చైనా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించాయి. ఈ నేపధ్యంలో ఆ చిత్రాన్ని సైతం అక్కడ కూడా రిలీజ్ చేస్తారు.

దాంతో తెలుగు ప్రేక్షకులతో పాటు చైనా ప్రేక్షకులనూ మెప్పించేలా సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ కేరళలోని కొచ్చి ప్రాంతంలో జరగనుంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఇందులో గురువు పాత్రలో నటిస్తున్నారు. విజయ్‌ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరుకి జోడీగా నయనతార నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై ఈ సినిమాను రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు బాణీలు అందిస్తారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇటీవల పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన ఇళయరాజాను చిరంజీవి కలిశారట. దాంతో ఈ సినిమాకు ఆయనే సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, సుదీప్‌, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై ఈ సినిమాను రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.

Comments

comments

Needi Naadi Oke Katha

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2