టాలీవుడ్

‘సై.. సైరా.. నరసింహారెడ్డి’ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్

మొత్తానికి మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. చిరు 151వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ‘సైరా నరసింహారెడ్డి’ టైటిల్‌ను చిత్రానికి ఖరారు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

రాయలసీమ ప్రాంతంలో ఉయ్యాలవాడ సాహసాలను కీర్తిస్తూ పాడుకునే ‘సై రా నరసింహారెడ్డి’ అనే పదాలనే చిరు 151వ‌ సినిమా టైటిల్ గా నిర్ణయించారు చిత్ర నిర్మాత‌లు. సైరా అని టైటిల్ గా ఫిక్స్ చేసి న‌ర‌సింహ‌రెడ్డిని క్యాప్ష‌న్ గా పెట్టారు.

ఓ కోట శిఖరంపై కాలిపోతున్న ఆంగ్లేయుల జాతీయ జెండా.. దాని చుట్టూ బ్రిటిషు సైనికుల శవాలు.. కోట బయట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. ఈ దృశ్యాలతో మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ చిరంజీవిని వెనుక నుంచి చూపించారు. ఆయన ముఖం కనపడలేదు. ‘సై.. సైరా నరసింహారెడ్డి’ అనే నినాదాలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించాయి.

సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా నయనతారను తీసుకోవడానికి చిత్ర యూనిచ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘ఉయ్యాలవాడ’ షూటింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll