బాలీవుడ్

‘బాహుబలి’ పోస్టర్ రికార్డ్ ని బ్రద్దలైంది

Amazon-Obhijaanబాహుబలికి ఉన్న ఎన్నో రికార్డ్ లలో ఒకటి..ప్రపంచంలో అత్యంత పెద్ద పోస్టర్ తో గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన ఘనత. ఇప్పుడు ఆ రికార్డ్ ని ఓ బెంగాళి చిత్రం బ్రద్దలుకొట్టింది. బెంగాలీ చిత్రం ‘అమెజాన్‌ ఓభిజాన్‌’ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. 60,800 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ పోస్టర్‌ను మోహన్‌బగన్‌ ఫుట్‌బాల్‌ మైదానంలో ఆవిష్కరించారు. ఈ సినిమా పోస్టర్‌ 320 అడుగుల పొడువు, 190 అడుగుల వెడల్పు ఉండటం విశేషం.

ఈ పోస్టర్‌ నిలువు కొలతను చూస్తే స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ(305.6మీటర్లు), కుతుబ్‌ మినార్‌(238 అడుగుల పొడవు)కంటే ఎక్కువగా ఉంటుందని చిత్ర నిర్మాతలు ఎస్‌వీఎఫ్‌ వెల్లడించారు. ఈ పోస్టర్ గతంలో ఉన్న బాహుబలి పోస్టర్ రికార్డ్ ని బ్రద్దలు కొట్టడం ఇప్పుడు మీడియాలో వార్తగా మారింది. ఈ పోస్టర్ తో ఈ సినిమాకు క్రేజ్ తెచ్చి బిజినెస్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.

కమలేశ్వర్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డిసెంబరు 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఛందేర్‌ పహర్‌ చిత్రానికి సీక్వెల్‌గా ఈ అమెజాన్‌ ఓభిజాన్‌ను తెరకెక్కించారు.

Comments

comments

Trailer

Latest

Recent

Coming Soon

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
లండన్ బాబులు

Now Showing

నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03
ఉన్నది ఒకటే జిందగీ OCT 27
రాజా ది గ్రేట్ OCT 18
రాజు గారి గది 2 OCT 13

Poll