కోలీవుడ్

కేరాఫ్ సూర్య : హీరోయిన్ కు దర్శకుడు క్షమాపణలు

mahreen-susindaranసుశీంద్రన్‌ దర్శకత్వంలో తాజాగా విడుదలైన చిత్రం ‘నెంజిల్‌ తునివిరుందాల్‌’(కేరాఫ్ సూర్య ). సందీప్‌కిషన్‌, మెహ్రీన్‌ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉందని, చాలా సీన్స్ …సినిమా వేగాన్ని తగ్గిస్తున్నాయని ప్రచారం జరిగింది. దీంతో మళ్లీ రంగంలోకి దిగిన సుశీంద్రన్‌ సినిమా లెంగ్త్ తగ్గించారు. ఈ సందర్భంగా హీరోయిన్ నటించిన అన్ని సన్నివేశాలను తొలగించారు. దాదాపు 20 నిమిషాల సన్నివేశాలకు కత్తెర వేశారు.

దీనిపై సుశీంద్రన్‌ మాట్లాడుతూ ‘ఈ నెల 10వ తేదీన ‘కేరాఫ్ సూర్య’ చిత్రం విడుదలైంది. అన్నివర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే కొన్ని సన్నివేశాలను తొలగిస్తే సినిమా మరింత వేగంగా ఉంటుందని కొందరు ప్రేక్షకులు, విశ్లేషకులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. అందుకే సినిమాలోని కొన్ని సన్నివేశాలను ప్రధానంగా హీరోయిన్ కు సంబంధించిన సన్నివేశాలన్నీ తొలగించాం.

అంతేకాకుండా సినిమా ఇంటర్వెల్, క్లైమాక్స్‌ సీన్స్ ను కూడా మార్చాం. ఈ సినిమా కొత్త వెర్షన్‌ మంగళవారం నుంచి అన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. దాదాపు 15 రోజులపాటు మెహ్రీన్‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించాం. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆమె సన్నివేశాలను తొలగించాం. దీనిపై ఆమెకు క్షమాపణలు తెలియజేసుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll