టాలీవుడ్

బీఫ్ తింది …ఆ నటిని బహిష్కరించండి

జాతీయ అవార్డు గెలుచుకున్న మలయాళ నటి సురభి లక్ష్మీపై మితవాద హిందూత్వ గ్రూపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓ టీవీ ఛానెల్‌లో నిర్వహించిన ఓనం కార్యక్రమంలో ఆమె బీఫ్‌ తినడం వారి ఆగ్రహానికి కారణమైంది. మలయాళం చానెల్‌ ‘మీడియా వన్‌’లో ఓనం సందర్భంగా ఒక ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాన్ని ఇటీవల ప్రసారం చేశారు. తిరుఓనం రోజు ఈ కార్యక్రమం ప్రసారమైంది. ఇందులో కేరళ వంటకంతో కలిపి తనకు ఇష్టమైన బీఫ్‌ ఫ్రైను తిన్నది. ఇది మితవాద హిందూత్వశక్తులకు మింగుడుపడలేదు.

సామాజిక మాధ్యమంలో నటి మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఓనం పండుగ సందర్భంగా ప్రసారమైన కార్యక్రమంలో ఆమె అలా చేయడం తగినదికాదని సంఫ్‌ు కార్యకర్తలు ఆరోపించారు. ఆ నటిని బహిష్కరించాలంటూ ఫేస్‌బుక్‌ పోస్టులు కూడా పెట్టారు. సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహంపై సురేబి లక్ష్మీ స్పదించారు. మూడురోజుల ముందే ఆ ఇంటర్వ్యూ తీసుకున్నారనిచెప్పారు. ‘కొంతకాలం గా ఆ చానెల్‌ వాళ్లు నా ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నారు

. నేను రెగ్యు లర్‌గా సందర్శించే ఒక హోటల్‌లో ఆ ఇంటర్వ్యూకు నేను అంగీకరిం చాను. ఆకలి అనేది జీవి ప్రాథమిక స్వభావం. ఆకలిగా ఉన్నప్పుడు… అది బీఫా, చికెనా, పోర్కా అనేది చూడరు..’ అని నటిలక్ష్మి అన్నారు. మళయాళ నటితోపాటు, న్యూస్‌ ఛానెల్‌ ‘మీడియా వన్‌’పై కూడా సంఘ్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఛానెల్‌పై అవమానకరమైన వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో సంఫ్‌ పోస్టులు పెట్టింది. ఉద్దేశపూర్వకంగానే ఒక మతానికి చెందిన మనోభావాలను ఆ ఛానెల్‌ గాయపరిచిందని విమర్శించారు.

ఇక ఆమె పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2014లో సురభి లక్ష్మి.. విపిన్ సుధాకర్‌ను వివాహమాడారు. వివాహ బంధంలో తలెత్తిన విభేదాల వల్ల విడిపోతున్నట్టు ఇద్దరూ ప్రకటించారు. విపిన్ తన ఫేస్‌బుక్ ద్వారా స్పందిస్తూ.. ఇవ్వాళ్టితో తమ వివాహ బంధానికి తెరపడింది. విడాకులు తీసుకున్నాం అని వెల్లడించారు. విడిపోయినా ఎప్పుడూ స్నేహితుల్లాగానే ఉంటామని చెప్పుకొచ్చారు. ఇక, సురభి లక్ష్మి కూడా తన ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు.

తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని అందరితోనూ పంచుకున్నానని, తనపై అంత నమ్మకం ఉంచినందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పింది. ‘‘ఈ రోజు నుంచి నా వివాహ బంధానికి తెరపడింది. ఇదే చివరి రోజు. కొన్ని విభేదాల వల్ల ఏడాదిన్నరగా దూరంగా ఉంటున్న మేము.. నేటితో అధికారికంగా మా బంధానికి ముగింపు పలికాం. మా విడాకులకు కారణమేంటో మాత్రం నేనిప్పుడు చెప్పలేను. మా వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నామని మాత్రం చెప్పగలను’’ అని సురభి లక్ష్మి చెప్పింది. 2017కు గానూ మలయాళం నుంచి ఉత్తమ నటిగా సురభి లక్ష్మి జాతీయ అవార్డును అందుకుంది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll