టాలీవుడ్

‘స్పైడర్‌’పై రజనీకాంత్ కామెంట్స్

spyderసూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘స్పైడర్‌’. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ సాధించి సూపర్‌హిట్‌ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింబపడుతోంది. ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రత్యేకంగా చూసారు.

‘స్పైడర్‌’ చిత్రం గురించి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ ”సినిమా చాలా బాగుంది. యాక్షన్‌తోపాటు మంచి మెసేజ్‌ కూడా ఈ సినిమాలో వుంది. మురుగదాస్‌ అద్భుతంగా ఈ సబ్జెక్ట్‌ని హ్యాండిల్‌ చేశారు. మహేష్‌బాబు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్‌ చేశారు. ‘స్పైడర్‌’లాంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన యూనిట్‌ సభ్యులందరికీ నా అభినందనలు” అన్నారు.

ఇదిలా ఉంటే… టాక్ సంభందం లేకుండా …సూపర్ స్టార్ మహేష్ తుఫాన్ తెలుగు రాష్ట్రాల్ని ఒణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓవ‌ర్సీస్ స‌హా, చెన్న‌య్‌-త‌మిళ‌నాడులోనూ అంతే ఉధృతి. రిలీజైన ప్ర‌తిచోటా `స్పైడ‌ర్‌` క‌లెక్ష‌న్ల‌ సునామీ కొన‌సాగుతోంది. ఓవ‌ర్సీస్‌లో ఒక్క‌రోజులో ప్రీమియ‌ర్లు క‌లుపుకుని 6.5 కోట్లు వ‌సూలు చేసిన `స్పైడ‌ర్‌`.. తెలుగు రాష్ట్రాల నుంచి అంతే భారీ మొత్తం ఆర్జిస్తోంది. ఇక చెన్న‌య్ రిపోర్ట్ అంతే ఘ‌నం.

చెన్నై ట్రేడ్ సమాచారం ప్ర‌కారం.. `స్పైడర్‌` తమిళ వెర్షన్ కేవ‌లం చెన్నై సిటీలో రూ. 46 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. తెలుగు వెర్షన్ రూ.16 లక్షల‌ గ్రాస్ క‌లుపుకుని మొత్తం మొదటిరోజు రూ.64 లక్షల గ్రాస్ వ‌సూలైంది. తెలుగు సినిమాల్లో చెన్న‌య్ సిటీవ‌ర‌కూ ఇదో రికార్డ్‌. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో మ‌హేష్‌దే రికార్డ్‌. ఈ వీకెండ్ రికార్డ్ మ‌హేష్ పేరునే నిలుస్తుంది. ఈ హ‌వా చూస్తుంటే మ‌న మ‌హేష్‌కి తంబీల్లో మంచి లాంచింగ్ దొరికింద‌ని చెప్పొచ్చు. హ‌హేష్ గ్లామ‌ర్, ఛ‌రిష్మాకి మురుగ‌దాస్ క్రేజు యాడై త‌మిళ‌నాట స్పైడ‌ర్ హ‌వా సాగుతోంద‌ని విశ్లేషించ‌వ‌చ్చు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll