బాలీవుడ్

పాము విసిరిన వ్యక్తిపై రివేంజ్ తీర్చుకుంది

ఫోర్న్ స్టార్ ఇమేజ్ నుంచి మెల్లి మెల్లిగా తప్పుకుంటూ బాలీవుడ్‌ నటిగా ఎదుగుతోంది సన్నీ లియోనీని. ఆమె సోషల్ మీడియాలో చాలా ఏక్టివ్ గా ఉంటుంది. అలాగే తను పనిచేసే సినిమా సెట్స్ లోనూ ఆమె చాలా తమాషాలు చేస్తూంటుంది. రీసెంట్ గా ఆమె నటిస్తున్న సినిమా టీమ్ లోని ఓ వ్యక్తి ఆటపట్టించారు. సన్నీ సెట్‌లో కూర్చొని ఏదో చదువుకుంటుండగా ఆమెపైకి రబ్బరు పాము విసిరారు.

సన్నీకి తెలియకుండా ఆమె వెనుక నుంచి వెళ్లి భుజంపై దాన్ని వదిలారు. ఇక అంతే పామును చూసిన సన్నీ ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. కంగారుగాపైకి లేచి, గెంతులేసి, పామును పక్కకు విసిరేశారు. ఆ వ్యక్తి పని పట్టడానికి అతడి వెంట పరుగు తీశారు. భయపడ్డ అతడు కూడా ఆమెకు అందకుండా ఉండాలని అక్కడి నుంచి పరిగెత్తారు. చాలా సరదాగా ఉన్న ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది.

అయితే ఆమె మాత్రం తక్కువ తినలేదు. తనపై రబ్బర్ పాము వదిలిన వ్యక్తిపై పగ తీర్చుకునే పోగ్రాం పెట్టుకుంది. ఆమె రెండు కేకులు తెప్పించి..ఇదిగో అలా రివేంజ్ తీర్చుకుంది.

సన్ని ప్రస్తుతం తన తర్వాతి చిత్రం ‘తేరా ఇంతెజార్‌’ ప్రచారంలో బిజీగా ఉన్నారు. రాజీవ్‌ వాలియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇటీవల రాజశేఖర్‌ నటించిన చిత్రం ‘గరుడవేగ’. ప్రవీణ్‌ సత్తారు దీనికి దర్శకత్వం వహించారు. పూజా కుమార్‌, శ్రద్ధాదాస్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలోని ‘డియో డియో’ ప్రత్యేక గీతంలో సన్నీ ఆడిపాడారు. ఈ పాటకు మంచి పాపులారిటీ వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll