బాలీవుడ్

‘2 కంట్రీస్’ పరిస్దితి అంతదారుణమా

సునీల్ హీరోగా స్వీయ దర్శకత్వంలో శంకర్ నిర్మించిన చిత్రం ‘2 కంట్రీస్’. మహాలక్ష్మి ఆర్ట్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం మొన్న శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయినప్పుడు సునీల్ ఈజ్ బ్యాక్ అని కామెంట్స్ వినిపించాయి. కానీ సినిమా చూసిన తరువాత సునీల్ కామెడీ కనెక్ట్ వర్కవుట్ కాలేదు. మలయాళం లో హిట్టయిన ఆ సక్సెస్ ఫుల్ కథ సునీల్ కి ఏ మాత్రం సెట్ కాలేదని కలెక్షన్స్ ప్రూవ్ చేసాయి. దాంతో ఈ సినిమా ఫైనల్ గా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

అన్ని చోట్లా కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయాయి. శెలవు రోజైన న్యూ ఇయర్ రోజు కూడా సినిమా ఏ మాత్రం రాబట్టలేకపోయింది. సినిమా కలెక్షన్స్ 2 రోజులు కలిపి 1 కోటి కూడా దాటాకపోవడం ట్రేడ్ వర్గాలల్లో షాకింగ్ న్యూస్ గా మారింది…ఓవర్సీస్ లో కనీసం థియేటర్ వైపు చూసేవాళ్ళు కూడా లేరు….సినిమా ఎలా ఉంది అని టాక్ అడిగి పట్టించుకునే వాళ్ళు కూడా లేరంటే సినిమా ఏ స్దాయి ఫ్లాఫో అర్ధం చేసుకోవచ్చు.

మనీషా రాజ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నరేష్, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ(30 ఇయర్స్‌ ఇండస్ట్రీ), రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటించారురు. గోపీ సుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. శ్రీధర్‌ సీపన డైలాగులు రాశారు.

కమెడియన్ నుంచి ప్రమోషన్ సంపాదించి హీరోగా ఎంట్రీ ఇచ్చి, వరస ఫ్లాఫ్ లతో నిలదొక్కుకుంనేందుకు కష్టపడుతున్న హీరో సునీల్ కు ఈ సినిమా కూడా డిజాస్టర్ అవటం బాధాకరమైన విషయమే.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll