గాసిప్స్

ఉంగరాల ఎఫెక్ట్…సునీల్ నెక్ట్స్ సినిమా కాన్సిల్

Ungarala-Rambabu-Review-Rating-Collections-and-storyవరుస ఫ్లాపులతో బాగా వెనుకబడిపోయిన సునీల్.. ‘ఉంగరాల రాంబాబు’ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ‘ఓనమాలు’.. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి మంచి సినిమాలు తీసిన క్రాంతి మాధవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆ చిత్రం ఫలితం ప్రభావం సునీల్ ఒప్పుకుని చేయాల్సిన సినిమాలపై పండింది. ఆ తర్వాత ప్రాజెక్టులు కూడా ఈ సినిమా డిజాస్టర్ అవడం వల్ల ఆగిపోయినట్లు తెలుస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం .. సునీల్ హీరోగా జెంటిల్మన్ దర్శకుడు శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో తమిళ సూపర్ హిట్ మూవీ చతురంగ వేట్టై సినిమా రీమేక్ చేయాల్సి ఉంది. గోపికృష్ణ డైరక్షన్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. కాని ప్రస్తుతం సునీల్ తో సినిమా తీసి రిస్క్ లో పడటం ఎందుకని ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారట దర్శక నిర్మాతలు.

అంతేకాదు చతురంగ వేట్టై సినిమా థ్రిల్లర్ కథాంశంతో సాగుతుంది. ఆ సినిమా కు సునీల్ కామెడీ జోనర్ కు పొంతన కుదరదనే అభిప్రాయంతో సినిమా సునీల్ తో కాదనుకున్నారట. ఇక అదే కాకుండా సునీల్ మార్కెట్ బాగా డల్ కావడంతో ఈ సినిమా చేజారింది అన్నది టాక్. దాంతో సునీల్ మళ్లీ తను కమెడియన్ గా కూడా చేసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది.

‘ఒక సినిమా ఫ్లాప్‌ అయ్యిందంటే దానర్థం సబ్జెక్ట్‌ను రిజెక్ట్‌ చేసినట్టు. అంతేకాని అందులో నటించిన స్టార్‌ను రిజెక్ట్‌ చేయడం కాదు’ అని అంటున్నారు సునీల్. హీరోగా చేస్తూనే కామెడీ ఆర్టిస్టుగా నటిస్తానని గతంలో చెప్పాను. ఇప్పుడు కూడా చెబుతున్నాను. ‘అందాల రాముడు’ తర్వాత హీరోగా ఛాన్స్‌లు వచ్చినా ‘మర్యాద రామన్న’ వరకు ఐదేండ్ల పాటు హీరోగా చేయలేదు. చాలా మంది చేయమని అడిగారు. రాజేంద్రప్రసాద్‌, గోవింద వంటి వారు చేస్తున్నారు కదా?, వారిని స్ఫూర్తిగా తీసుకుని హీరోగా చేసుకుంటూ వస్తున్నా.

‘మర్యాద రామన్న’ తర్వాత హీరోగా చేయకూడదనుకున్నా నిర్మాతలు వదల్లేదు. హీరోగా చేస్తున్న టైమ్‌లో కామెడీ ఆర్టిస్టుగా చేస్తే ఆ సినిమాపై ప్రభావం పడుతుందని నేనూ చేయలేదు. కానీ కామెడీ పాత్రలు చేయడమనేది నాకు రిలీఫ్‌. అలాగే హీరోగా ఎన్ని చేసినా ఓ ఏజ్‌ వచ్చాక క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఏ హీరో అయినా సరే చేయాల్సిందే అన్నారు సునీల్.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll