కోలీవుడ్

షాకింగ్ న్యూస్ : రిలీజైన సినిమాకు రీషూట్స్, రీ రిలీజ్

careofsurya250917_001సుశీంద్రన్‌ దర్శకత్వంలో సందీప్‌కిషన్‌ హీరోగా ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘నెంజిల్‌ తునివిరుందాల్‌’(తెలుగులో c/o సూర్య‌). ఈ నెల పదో తేదీన ఈ సినిమా విడుదలయ్యి…మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం యూనిట్ ని బాగా నిరాసపరిచింది. ముఖ్యంగా దర్శకుడు ఈ చిత్రం విజయం పై పూర్తి నమ్మకంతో ఉన్నారు దాంతో వెంటనే రంగంలోకి దిగి చిత్రం నిడివి తగ్గించారు దర్శకుడు సుశీంద్రన్‌. ఇందులో భాగంగా హీరోయిన్ కు సంబంధించిన 20 నిమిషాల సన్నివేశాలను తొలగించారు. అయినప్పటికీ సినిమాకు స్పందన రాలేదు. దీంతో ఈ సినిమాను శుక్రవారం నుంచి థియోటర్స్ నుంచి తీసేస్తున్నట్లు దర్శకుడు ప్రకటించారు.

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా నిడివి తగ్గించి విడుదల చేశాం. కానీ మేం అనుకున్నట్లు జరగలేదు. అందుకే అన్ని థియేటర్ల నుంచి ఈ సినిమాను ఉపసంహరించుకున్నాం. ఇందులోని సన్నివేశాలను మార్పులు, చేర్పులు చేసి డిసెంబరు 15వ తేదీన మళ్లీ విడుదల చేయనున్నాం.

ప్రస్తుతం ఏయే థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోందో.. అవే థియేటర్లలో కొత్త వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలికాలంలో ఇలాంటి ప్రయోగం చేసిన దర్శకుడు సుశీంద్రన్‌ మాత్రమే. ఈ కథను ఎలాగైనా హిట్‌ జాబితాలోకి చేర్చే దిశగా సుశీంద్రన్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll