టాలీవుడ్

సందీప్‌ కిషన్ కొత్త చిత్రం ‘కేరాఫ్‌ సూర్య’ టీజర్

సందీప్‌ కిషన్, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్‌ మెహరీన్‌ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘కేరాఫ్‌ సూర్య’. ‘నా పేరు శివ’ ఫేం సుసీంద్రన్‌ దర్శకత్వంలో ‘స్వామి రారా’ చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌ లుక్‌ని హీరో సూర్య విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్ ని నాని రిలీజ్ చే సారు. టీజర్ బాగుందని అంతటా వినిపిస్తోంది.

సహ నిర్మాత రాజేష్‌ దండా మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ ప్యాక్డ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.సందీప్‌ కిషన్‌ ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా తమిళ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌లో ఒకరైన డి. ఇమ్మాన్‌ను టాలీవుడ్‌కి పరిచయం చే స్తున్నాం. త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మా చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జె.లక్ష్మణ్‌ కుమార్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: జె.సి, సమర్పణ: శంకర్‌ చిగురుపాటి.

Comments

comments

Trending

Latest

Trailer

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll