టాలీవుడ్

యాంకర్ శ్రీముఖి ఇలాంటి సినమాలో కూడా…టీజర్ వచ్చేసింది

యాంకర్ శ్రీ ముఖీ వరసగా సినిమాల్లో మాత్రం మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. మొన్నటి వరకు సినిమాల్లో కనిపించినా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువగా దర్శనం ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం మెయిన్ లీడ్ లో హీరోయిన్ గా అవకాశాలను అందుకుంటోంది. హర్షవర్దన్ తీస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ తరువాత.. మరో డిఫరెంట్ సినిమాలో కనిపించబోతోంది. వి.ఎస్.వాసు తెరకెక్కిస్తోన్న ఆ సినిమా టైటిల్ ”కుటుంబ కథా చిత్రం”. నందు హీరోగా కనిపించబోతున్నాడు.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌ ఈరోజు విడుదలయ్యాయి. ఫస్ట్‌లుక్‌లో నందు, శ్రీముఖి దిగాలుగా కూర్చుని ఉంటే వెనక కమల్‌ కామరాజు భయంకరంగా చూస్తుండటం చిత్రంపై ఆసక్తి కలిగిస్తోంది. ఇదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
భాస్కరా గ్రూప్‌ ఆఫ్‌ మీడియా పతాకంపై దాసరి భాస్కర్‌ యాదవ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్‌ కస్యప్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్ తరహాలో ఉన్నా కూడా ప్రస్తుత రోజుల్లో జరుగుతోన్న పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. దర్శకుడు వాసు మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో చాలా వరకు యువ జంటలు పెళ్లి చేసుకోగానే జాయింట్ ఫ్యామిలీ తో కలిసి ఉండడానికి అస్సలు ఇష్టపడడం లేదు.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు మంచి రిలేషన్ తో కలిసి ఉండేవి. ఒకరికి బాధ్యత వస్తే కుటుంబం మొత్తం వారికి తోడుగా ఉండేది కానీ ఇప్పుడు అలాంటి ఆప్యాయతలు కరువవుతున్నాయి. ఒక ప్రాబ్లమ్ వస్తే ఒక్కరే ఎదుర్కోవాలి అనే భావన అందరిలో బలంగా పాతుకుపోయింది.

ఈ సినిమాలో ఆ తరహాలో ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చేసిన నందు – శ్రీ ముఖి ఐటి ఉద్యోగం చేస్తోన్న భార్య భర్తలుగా కనిపిస్తారు. ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం. కానీ వారిద్దరి మధ్య మరొక వ్యక్తి ప్రవేశిస్తే వారి జీవితం మొత్తం ఎలా టర్న్ అయ్యిందనే పాయింట్ కూడా ఈ సినిమాలో ఉంటుందని దర్శకుడు చెప్పాడు

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు 17

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll