కోలీవుడ్

అయ్యో… ‘స్పైడర్’కు ఇంకో దెబ్బ పడిందే

మహేష్‌బాబు-మురుగదాస్ కాంబినేషన్‌లో రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్పైడర్ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ తరువాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా కావటం, ఈ సినిమాతో మహేష్ తొలిసారిగా కోలీవుడ్ లో అడుగుపెడుతుండటంతో స్పైడర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూపర్ స్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కటంతో పాటు సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతుండం స్పైడర్ మీద అంచనాలను భారీగా పెంచేసింది.

అయితే ఈ సినిమాకు తెలుగురాష్ట్రాల్లో డివైడ్ టాక్ వచ్చింది. సినిమా ఇక్కడ వాళ్లకు నచ్చలేదు. దాంతో ఇక్కడ స్పైడర్ కలెక్షన్స్ నెమ్మదించినా… తమిళనాడులో ‘స్పైడర్’ కలెక్షన్స్ ఊపందుకున్నాయి. స్పైడర్ మూవీలో విలన్ పాత్రలో నటించిన ఎస్.జె సూర్య నటనకు తమిళ ప్రేక్షకులు ఫిదా కావడం.. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘స్పైడర్’ మూవీపై ప్రశంసలు కురిపించడంతో తమిళ తంబీలు స్పైడర్ మూవీకి క్యూ కట్టడం మొదలెట్టారు. అంతవరకూ బాగానే ఉంది. పోన్లే..ఇక్కడ దెబ్బ కొట్టినా…అక్కడైనా రికవరీ ఉంది కదా అంతా హ్యాపీ ఫీలయ్యారు. అయితే అక్కడా ఓ దెబ్బ పడింది.

స్పైడర్ సినిమా బాగా నడుస్తున్న తమిళనాట కూడా అనుకోని అవాంతరాలు ఎదురయ్య ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం విధించే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కి తోడు తమిళనాడు ప్రభుత్వం కూడా అదనంగా పది శాతం దాకా వినోదపు పన్ను వేస్తుండటాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్రంలోని మల్టీప్లెక్సులు స్ట్రైక్ చేస్తున్నాయి. కొన్ని మల్టీప్లెక్సులు నడుస్తున్నప్పటికీ.. కొన్ని మాత్రం షోలు ఆపేశాయి. ఇది ‘స్పైడర్’కు ఎదురు దెబ్బే. ఈ విషయాన్ని నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారు ట్వీట్ ద్వారా తెలియచేసారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll