టాలీవుడ్

‘స్పైడర్‌’రికార్డ్… ఆ విషయంలో తొలి చిత్రం

Spyderమహేశ్‌బాబు హీరో గా నటించిన చిత్రం ‘స్పైడర్‌’. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహించారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ పాత్ర పోషించారు. దర్శకుడు ఎస్‌.జె. సూర్య ప్రతినాయకుడిగా కనిపించారు. గత ఏడాది సెప్టెంబరు 27న విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తో అదే స్దాయి రివ్యూలు అందుకుంది. అయితే బాక్సాఫీసు వద్ద మాత్రం విశేషమైన వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది.

నెల్లూరు జిల్లా కోటాలోని రామరాజు థియేటర్లో ‘స్పైడర్‌’ను నాలుగు షోలలో విజయవంతంగా వందరోజులు ప్రదర్శించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.162 కోట్లు వసూలు (షేర్‌ రూ.86 కోట్లు) చేసినట్లు సమాచారం. జీఎస్టీ తర్వాత ఈ మైలురాయిని దాటిన తొలి చిత్రమిదేనని చెబుతున్నారు. మహేశ్‌ ఇందులో ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగిగా కనిపించారు. ఎస్‌.జె. సూర్య సైకో కిల్లర్‌గా కనిపించారు.

మహేశ్‌ ఈ సినిమా తర్వాత ‘భరత్‌ అనే నేను’లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మాత. కైరా అడ్వాణీ కథానాయిక. ప్రకాశ్‌రాజ్‌, శరత్‌కుమార్‌, ఆమని, సితార, పోసాని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 27న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16