టాలీవుడ్

వేరే దారిలేక ‘గృహం’లో ప్రవేసించిన సిద్దార్ద్

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్స్ ద్వారా తమిళ హీరో సిద్ధార్థ్ తెలుగింటి కుర్రోడు గా మారిపోయాడు. అయితే ఆయనకి గత కొంతకాలంగా హిట్ అనేది దొరకటం లేదు. వరస ప్లాఫ్స్ అత‌డి భ‌విష్య‌త్‌నే ప్ర‌శ్నార్థ‌కం చేసే పరిస్దితికి చేరుకున్నాయి. తమిళంలో ఒకటీ అరా ఓకే అనిపించుకున్నా… సిద్దార్ద్ కి తెలుగులో సక్సెస్ వచ్చి చాలాకాలమే అయింది. అయినా సరే హిట్ కొట్టాలన్న కసితో వరసగా సినిమాలు చేస్తూనే వున్నాడు. కానీ సిద్దార్ద్ సినిమాలని పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయారు. అందుకే ఈసారి ట్రెండ్ ని ఫాలో అవుతూ హారర్ మూవీతో వస్తున్నాడు ఈ లవర్ బాయ్.

ఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఓ చిత్రాన్ని ఆయన చేస్తున్నారు. మణిరత్నం శిష్యుడు మిళింద్‌ రావ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి తెలుగులో ‘గృహం’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా సిద్ధార్థ్‌ వెల్లడించారు. ‘‘నా తదుపరి చిత్రం ‘గృహం’తో తెలుగులోకి మళ్లీ వస్తున్నందుకు ఉద్వేగంగా ఉంది. నాతో పాటు ఆండ్రియా జెర్మియా, అతుల్‌ కుల్‌కర్ణి నటిస్తున్నారు. నవంబర్‌లో విడుదలవుతుంది’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. అలాగే సినిమా ఫస్ట్‌లుక్‌నూ ఆయన పోస్ట్‌ చేశారు.

చీకటిలో ఓ ఇల్లు.. సీరియస్‌గా సిద్ధార్థ్‌, ఆండ్రియాలు.. వీరిద్దరి మధ్య గాలిలో ఓ యువతి.. ఇలా ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని చూపించారు. హారర్‌ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

నవంబరు 3న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిలింద్‌రావ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదే చిత్రం తమిళంలో ‘అవల్‌’ పేరుతో, హిందీలో ‘ది హౌస్‌ నెక్ట్స్‌ డోర్‌’ పేరుతో రానున్నది. సిద్ధార్థ్‌ సొంత నిర్మాణ సంస్థ ఎటకి ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌పై తయారవుతోన్న ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18 పిక్చర్స్‌ సంస్థ సమర్పిస్తోంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll