గాసిప్స్

‘సాహో’కథపై ఆ వార్త మీడియా వండి వడ్డించిందే,నమ్మద్దు

shraddha-kapoor-27ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్‌ దర్శకుడు. ఇందులో ప్రభాస్‌కి జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ నటిస్తోంది. అయితే ఇందులో శ్రద్ధా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు గత కొద్ది వారాలుగా మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ డ్యూయిల్ రోల్ సినిమా కథకు కీలకమైందని మరీ చెప్తున్నారు. ఈ సినిమా శ్రద్ధా డ్యూయల్ రోల్ లో నటిస్తుందని అందులో ఒకటి నెగెటివ్ క్యారెక్టర్ అన్న ప్రచారం కూడా జరిగింది.

అయితే ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చింది శ్రద్ధా. సాహో సినిమాలో తాను ఒక్క పాత్రే చేస్తున్నట్టుగా చెప్పిన శ్రద్ధా పాత్రలోనే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలపింది. అంతేకాదు ఈ సినిమాలో తాను యాక్షన్ ఎపిసోడ్స్ లోనూ నటిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చింది.

ఇక ఈ పాత్ర రాయలసీమ నుంచి వచ్చే పల్లెటూరి అమాయుకురాలు..తర్వాత సిటీకి వచ్చి మోడ్రన్ గర్ల్ గా తయారవుతుంది. ఆ వార్తని సగం విని, డ్యూయిల్ రోల్ ని కల్పించేసారు. ఒకే పాత్రలో రెండు లేయర్స్ కనపడతాయన్నమాట. ఇందులో శ్రద్ధాకు ఫైటింగ్‌ సన్నివేశాలు కూడా ఉన్నట్లు టాలీవుడ్‌ టాక్‌. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2018లో ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాహుబలి 2 తో జాతీయ స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్‌ తదుపరి చిత్రం `సాహో’ టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్‌ రావడంతో ఆ హవాను కొనసాగించేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. బాహుబలి ఇచ్చిన క్రేజ్‌ ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్‌ చాలా జాగ్రత్తగా తన సాహో సినిమా క్యాస్టింగ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా బాలీవుడ్‌ నుండి కోలీవుడ్‌ నుండి కూడా యాక్టర్లను దింపడానికి కారణం కూడా అదే. కేవలం తెలుగు రాష్ట్రాలలోని కాకుండా హిందీ, ఇతర భాషలలో సహితం సినిమా ఒరిజినాలిటీ మిస్సవ్వకుండా నచ్చే విధంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.

సాహో సినిమాను ముంబాయ్‌ లో కాస్త షూట్‌ చేసిన దర్శకుడు సుజిత్‌ బృందం త్వరలో అబుధబి, ఇతర యురోపియన్‌ దేశాలలో షూట్ చేస్తారు. చివరి షెడ్యూల్‌ ను హైదరాబాద్ తో ముగించాలని భావిస్తున్నారు.

Comments

comments

Latest

Promo

song

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

కథలో రాజకుమారి SEP 15
ఉంగరాల రాంబాబు SEP 15
శ్రీవల్లీ SEP 15
యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll