టాలీవుడ్

ఆస్కార్‌ వేడుకలో శ్రీదేవి, శశికపూర్‌

osca90వ ఆస్కార్‌ అవార్డుల‌ వేడుక ప్రారంభమైంది. లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక కన్నులపండువగా జరుగుతోంది భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 6.30 గంటలకు ఈ వేడుక ప్రారంభమైంది. ఈ సందర్భంగా దివంగత బాలీవుడ్‌ నటులు శశికపూర్‌, శ్రీదేవికి నివాళులు అర్పించారు. ప్రముఖ అమెరికన్‌ సంగీత దర్శకుడు ఎడ్డీ వెడ్డర్‌ స్టేజ్‌పైన సంగీత ప్రదర్శనతో వీరికి నివాళులు అర్పించారు. 2017 డిసెంబర్‌లో శశికపూర్‌ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. 2018 ఫిబ్రవరి 25న శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి కన్నుమూశారు. భారతీయ ప్రేక్షకుల కోసం.. వీరికి నివాళులు అర్పించేలా ఆస్కార్‌ ఏర్పాట్లు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమాలు ఈ ఆస్కార్‌ కోసం పోటీ పడ్డాయి. ఉత్తమ చిత్రం విభాగంలో ‘కాల్‌ మి బై యువర్‌ నేమ్‌’, ‘డార్కెస్ట్‌ అవర్‌’, ‘డన్‌క్రిక్‌’ ‘గెట్‌ అవుట్‌’, ‘లేడీ బర్డ్‌’ , ‘ఫాంటమ్‌ థ్రెడ్‌’ ‘ద పోస్ట్‌’, ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ ,’త్రీ బిల్‌ బోర్డ్స్‌ అవుట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌- మిస్సోరి’ చిత్రాలు ఈ పోటీలో నిలిచాయి. అంతిమంగాఅత్యధిక నామినేషన్లు మూడు చిత్రాలు దక్కించుకున్నాయి. ఇందులో ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ అత్యధికంగా 13 విభాగాల్లోనూ, తొమ్మిది విభాగాల్లో ‘త్రీ బిల్‌ బోర్డ్స్‌ అవుట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌ -మిస్సోరి’, ‘డన్‌క్రిక్‌’ 7 విభాగాల్లోనూ ఆస్కార్‌ను గెలుచుకునేందుకు బరిలో నిలిచాయి. మరో విశేషం ఏమిటంటే దిషేప్‌ ఆప్‌ వాటర్‌, డన్‌క్రిక్‌, త్రీ విల్‌ బోర్డ్స్‌ అవుట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌- మిస్సోరి… చిత్రాలే ఉత్తమ చిత్రాల విభాగంలోనూ పోటీ పడుతున్నాయి.

‘కాల్‌ మి బై యువర్‌ నేమ్‌’, ‘డార్కెస్ట్‌ అవర్‌’, ‘గెట్‌ అవుట్‌’, ‘ది ఫాంటమ్‌ థ్రెడ్‌’, ‘ది పోస్ట్‌’ చిత్రాలు మిగిలిన విభాగాల్లో ఆస్కార్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ‘ఫాంటమ్‌ థ్రెడ్‌’ తీసిన పాల్‌ థామస్‌ ఆండ్రసన్‌ ఉత్తమదర్శకుడిగా పురస్కారం గెలుచుకునేందుకు ఆస్కారం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈయనతో పాటు గల్లీర్మో డెల్‌ టోరో (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌), గ్రీటా గ్రెవిగ్‌ (లేడీ బర్డ్‌), క్రిస్టోఫర్‌ నోలాన్‌ (డ్రంకిక్‌) పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

తన నటనతో ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’లో మెప్పించిన శాల్లీ హాకిన్స్‌కి ఉత్తమ నటిగా ఆస్కార్‌ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈమెతో పాటు ఫ్రాన్సిస్‌ మెక్‌ డోర్మండ్‌ (త్రీ బిల్‌ బోర్డ్స్‌ అవుట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌ -మిస్సోరి), మార్గట్‌ రోబీ (ఐ టోన్యా) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తిమోతీ చాల్మెట్‌కు బెస్ట్‌ యాక్టర్‌ పురస్కారం వచ్చే చాన్స్‌లు ఉన్నాయని విశ్లేషకుల భావిస్తున్నారు. గత ఏడాది తన మాటలతో ఆహూతులను అలరించిన జిమ్మీ కిమ్మెల్‌ ఈ ఏడాదీ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2