బాలీవుడ్

మేరీ పాస్ మా హై..డైలాగు శశికుమార్ కన్నుమూత

ShashiKapoorనా దగ్గర బిల్డింగ్‌లు ఉన్నాయి. ప్రాపర్టీలు ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. బంగ్లాలు ఉన్నాయి. వాహనాలున్నాయి. నీ దగ్గర ఏముంది. అని డైలాగులు కురిపించిన అమితాబ్‌కు.. చాలా కూల్‌గా శశి కపూర్ వదిలిన ఆ మరుపురాని డైలాగ్ మీకు తెలుసా. మేరీ పాస్ మా హై. బాలీవుడ్ ఫిల్మ్ హిస్టరీలో ఇదో ఫేమస్ డైలాగ్. సినీ ప్రేక్షకుల్ని అమితంగా థ్రిల్ చేసిన ఈ డైలాగ్ 1975లో రిలీజైన దివార్ సినిమాలోనిది.

అన్నాదమ్ముల మధ్య చోటుచేసుకునే ఆసక్తికర సన్నివేశం అది. దివార్ సినిమాలో మేరా పాస్ మా హై అన్న డైలాగ్ కొట్టింది శశి కపూర్. పోలీస్ ఆఫీసర్ పాత్రలో శశికపూర్ ఆ సినిమాలో నటించారు. ఓ దొంగ పాత్రలో అమితాబ్ నటించారు. చాలా భావోద్వేగంగా సాగే ఆ సన్నివేశం ఎన్నో సినిమాలకు ఆదర్శంగా నిలిచింది. ఆ శశికుమారే ఈ రోజు కన్ను మూసారు.

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. నటుడిగా, నిర్మాత, దర్శకుడిగా సినీ రంగంలో శశికపూర్‌ తనదైన ముద్రవేశారు. బాలీవుడ్‌కు చెందిన కపూర్‌ల కుటుంబంలో శశికపూర్‌ సభ్యుడు. ఆయన 1938 మార్చి 18న బ్రిటిష్‌ పాలనలోని నాటి కలకత్తా(కోల్‌కతా)లో జన్మించారు.

పృథ్వీరాజ్‌ కపూర్‌ మూడో కుమారుడు శశికపూర్‌. రాజ్‌కపూర్‌, షమ్మీ కపూర్‌లకు సోదరుడు. కరణ్‌ కపూర్‌, కునాల్‌ కపూర్‌, సంజనా కపూర్‌లు శశికపూర్‌ సంతానం. చిత్ర పరిశ్రమకు శశికపూర్‌ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించింది. ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును కూడా శశికపూర్‌ అందుకున్నారు.

శశికపూర్‌ నాలుగేళ్ల వయసు నుంచే నట జీవితాన్ని ప్రారంభించారు. ఆయన తండ్రి స్థాపించిన పృథ్వీ థియేటర్స్‌తో పాటు ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన నాటకాలలో వివిధ పాత్రలు పోషించే వారు. బాల నటుడిగా సంగ్రామ్‌(1950), దనపాణి(1953) వంటి కమర్షియల్‌ చిత్రాల్లో నటించారు. 1948లో వచ్చిన ‘ఆగ్‌’, 1951లో వచ్చిన ‘ఆవారా’ చిత్రాల్లో తన అన్న రాజ్‌కపూర్‌ చిన్నప్పటి పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ‘ధర్మపుత్ర’ చిత్రం ద్వారా నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. కేవలం హిందీ సినిమాల్లోనే కాదు.. పలు ఇంగ్లిష్‌ చిత్రాల్లోనూ నటించారు. 1998లో చివరి సారిగా ‘సైడ్‌ స్ట్రీట్స్‌’ అనే ఆంగ్ల చిత్రంలో నటించారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2