గాసిప్స్

ఆ సినిమాని లేపేసే ‘మహానుభావుడు’? , మరి మారుతి ఏమంటాడంటే…

mahanubhavudu stills 08కాపీ కొట్టడం అనేది ఓ హక్కులా సినీ పరిశ్రమలో పాతుకుపోయింది. ఎక్కడెక్కడ సినిమాలు తెచ్చి , కాస్త తన మార్క్ కలిపి కాపీ కొట్టి వదిలేసి, హిట్ కొట్టే కాపీ తెలివితేటలు, నైపుణ్యం ఉన్నవారే చాలా మంది మన తెలుగు పరిశ్రమలో ఉన్నారు. రాణిస్తున్నారు. అయితే దొరకనంతవరకూ అందరూ దొరలే. దొరికితేనే దొంగలు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే దర్శకుడు మారుతి ..ఇప్పుడు కాపీ కొట్టి ఓ చిత్రాన్ని రెడీ చేస్తున్నారంటూ గుప్పుమంది మీడియాలో. ఏమా కాపీ కథ..ఎంతవరకూ నిజం ఉందో తెలియదు కానీ అసలు విషయం తెలుసుకుందాం…

శర్వానంద్ హీరోగా నటించిన సినిమా ‘మహానుభావుడు’. ఈ సినిమా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సినిమా ఈ దసరా రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. అభిమానులకి దసరా కానుకగా సెప్టెంబర్ 29న సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు యూవీ క్రియేషన్స్ బ్యానర్ అధినేతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న తరుణంలో సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేసారు. అయితే ట్రైలర్ రిలీడ్ చేసిన వెంటనే ఈ సినిమా ఓ మళయాళ చిత్రం కాపీ అంటూ ప్రచారం మొదలైపోయింది.

మహానుభావుడు ట్రైలర్ నిన్న రాత్రి అలా యూట్యూబ్ లో విడుదల చేశారో లేదో ఈ మహానుభావుడు సినిమాని మారుతి ఒక మలయాళం సినిమా నుండి కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం మొదలయ్యింది.

ఈ మహానుభావుడు చిత్రాన్ని మారుతీ మలయాళం సినిమా నార్త్ 24 కాథం అనే సినిమా స్పూర్తిగానో….. లేకపొతే అదే సినిమాను యాజిటీజ్ గా కాపీ కొట్టాడో… అంటూ ఫిలింనగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నార్త్ 24 కాథం అనే మలయాళం సినిమా ట్రైలర్స్, క్లిప్పింగ్స్ యూట్యూబ్ లో చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసే మారుతీ ఇలా మహానుభావుడు చిత్రాన్ని తెరకెక్కించాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ లో ఆ మళయాళ సినిమా చూసే ఓపిక లేకపోతే …వికీపీడియాకు వెళ్లి ఆ సినాప్సిస్ చదవండి..కాస్త పోలికలు కనిపిస్తాయి.

ఇందులో శర్వా అబ్సెసివ్‌ కంప్లెసివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ)అనే వ్యాధితో బాధపడుతున్న కుర్రాడులా దర్శనమివ్వబోతున్నాడు. మెహరిన్‌ క్యూట్‌గా గ్లామర్‌తో కనిపించింది. హీరో శర్వానంద్‌ శుభ్రతను కోరికునే యువకుడు అంటే మిస్టర్‌ క్లీన్‌గా కనిపించాడు.

అయితే మారుతీ మాత్రం ఈ మహానుభావుడు లాంటి సినిమాలు అంటే ఓసిడి మీద ప్రపంచవ్యాప్తంగా అయితే సినిమాలు చాలానే వచ్చాయి…. కానీ వాటితో ఈ మహానుభావుడు సినిమాకి పోలిక ఉండదు అని చెప్బుతున్నాడు. చూద్దాం మహానుభావుడు సినిమా విడుదలయ్యాక ఆ సినిమాకి కాపీనా… లేదా అనేది.

Comments

comments

Latest

Promo

song

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

కథలో రాజకుమారి SEP 15
ఉంగరాల రాంబాబు SEP 15
శ్రీవల్లీ SEP 15
యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll