టాలీవుడ్

లేడీ ‘అర్జున్ రెడ్డి: షకీలా.. ‘శీలవతి’ టీజర్ ఇదిగో

షకీలా 250వ చిత్రంగా ‘జి’ స్టూడియోస్ సమర్పణలో, రాఘవ ఎమ్ గణేష్ మరియు వీరు బాసింశెట్టి నిర్మాతలుగా, సాయిరామ్ దాసరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శీలవతి’. కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. టీజర్ చూసినవాళ్లంతా లేడీ అర్జున్ రెడ్డిలా ఉందంటున్నారు. మీరూ టీజర్ పై ఓ లుక్కేయండి.

ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. ‘‘నా 250వ చిత్రంలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నా. ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. నెక్స్ట్ సీన్ ఏంటనేది.. అందులో నటించే నాకు కూడా తెలియకుండా స్క్రీన్ ప్లే ను ప్లాన్ చేసాడు దర్శకుడు. నిర్మాతలిద్దరూ సినిమా కోసం ఏం కావాలన్నా అందించారు. మే లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

గీతాంజలి (ఫ్రూటీ) మాట్లాడుతూ.. ‘‘షకీలా గారితో ఇది నా రెండవ చిత్రం. యంగ్ టీమ్ కలసి పని చేసిన సినిమా కనుక చాలా ఫాస్ట్‌గా ఇంట్రెస్టింగ్‌గా షూటింగ్ పూర్తి చేశాం. ఫైనల్‌గా సినిమా చాలా బాగా వచ్చింది. మీరంతా సినిమా చూసి ఆదరించాలని కోరుతున్నా’’ అన్నారు.

నిర్మాత గణేష్ మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్‌లో వస్తున్న మొదటి సినిమా ఇది. షూటింగ్ అంతా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే లో విడుదల చేయనున్నాము’’ అన్నారు.

మరో నిర్మాత వీరు బాసింశెట్టి మాట్లాడుతూ.. ‘‘ఇంతకు ముందు రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినా.. సంతృప్తి నిచ్చిన సినిమా మాత్రం ‘శీలవతి’. నాకు, షకీలా గారికి మధ్య ఒక నిర్మాత, ఆర్టిస్ట్‌లా మొదలైన జర్నీ.. అక్కా.. తమ్ముడు అనుకునేంతగా బంధం ఏర్పడింది. తను చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.

దర్శకుడు సాయిరామ్ దాసరి మాట్లాడుతూ.. ‘‘కెమెరామెన్ బెస్ట్ వర్క్‌ను ఇచ్చాడు. నిర్మాతలు ఇద్దరూ చాలా మంచి సపోర్ట్‌ను అందించారు. ఈ సినిమా చూశాక.. ఇంతకు ముందు షకీలా వేరు ఈ సినిమా తరువాత షకీలా వేరు అని మీరే అంటారు. ఈ సినిమాతో మంచి పేరొస్తుంది తనకు. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ మరియు హార్రర్ కామెడీ జోనర్. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2