టాలీవుడ్

‘జై లవకుశ’ విషయమై పై రాజమౌళికు సెటైర్స్

jai-lava-kusaమరోసారి ఎన్టీఆర్‌ నటనకు రాజమౌళి ఫిదా అయిపోయారట. ఎన్టీఆర్‌ హీరోగా తొలిసారి త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రం ‘జై లవకుశ’. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ నటన, డ్యాన్సులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘జై లవకుశ’ సినిమాను చూసిన రాజమౌళి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘తారక్‌.. నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోంది. మాటలు సరిపోవు. జై.. జై..’ అని ట్వీట్‌ చేశారు. ఇప్పుడీ ట్వీట్ పై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసిన చిత్రాలన్నీ డిజాస్టర్స్ అయినవే.

మొన్న యుద్ధం శరణం సినిమాకు రాజమౌళి చాలా పాజిటివ్ కామెంట్స్ చేశాడు. దీంతో ఆ ప్రభావం ఎంతో కొంత ఓ వర్గం ప్రేక్షకులపై పడే ఉంటుంది. చివరికి సినిమా చుసిన తర్వాత రాజమౌలి మాటలు ఇంకోసారి నమ్మకూడదు.. అందరిలానే ఆయన కూడా బాలేకపోయినా పొగుడుతున్నారని అర్థమైందని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇక పటేల్ సర్ కి అలాగే పైసా వసూల్ కి రాజమౌళి ఇచ్చిన రివ్యూ అంతగా ఎవరు నచ్చలేదు. అదే తరహాలో ఇప్పుడు జై లవకుశ సినిమాపై చేసిన కామెంట్స్ కి చాలా వరకు నెటిజన్స్ కౌంటర్లు వేస్తున్నారు.

దానికి తోడు రాజమౌళి సినిమా గురించి చెప్పకపోవడం మైనెస్ అయ్యింది. తన ట్వీట్ లో రాజమౌళి ఎక్కడా కూడా సినిమా కథ గురించి గాని పాత్రల గురించి గాని ప్రస్తావించలేదు. కేవలం తారక్ పై ఉన్న ప్రేమను మాత్రమే చూపించాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ‘తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో మీ అభిమాన నటుడు ఎవరు?’ అని ఎస్‌.ఎస్‌.రాజమౌళిని అడిగితే.. ఆయన మరో ఆలోచన లేకుండా చెప్పే పేరు ఎన్టీఆర్‌. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన పంచుకున్నారు కూడా. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ‘స్టూడెంట్‌ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

Comments

comments

Trailer

Promo

song

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll