బాక్స్ ఆఫీస్

పవన్ పేరు చెప్తే అంతే, ఆ రేటు పలుకుతుంది

pawan-(1)సినిమా బిజినెస్ లో గత కొంతకాలంగా శాటిలైట్ రైట్స్ ఓ భాగంగా మారాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల శాటిలైట్ రైట్స్ ని ఛానెల్స్ ఎగబడి ఇంకా చెప్పాలంటే పోటి పడి మరీ కొంటున్నాయి. తాజాగా త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రం రైట్స్ క్రేజీ కాంపిటేషన్ లో మంచి రేటుకు అమ్మేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఇప్పటికి ఈ చిత్రానికి సంభందించి ప్రమోషన్ మొదలయ్యాయి. అలాగే త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ కు మంచి స్పందన లభించింది. పవన్ & త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే బిజినెస్ సర్కిల్స్ లో అంచనాలు భారీ స్థాయికి చేరుకోగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారి ధరకు అమ్ముడు అయినట్లు సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం… స్టార్ మా ఈ సినిమా రైట్స్ కోసం 15 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అలాగే జి తెలుగు కూడా ఈ పోటిలో ఉండగా జెమిని టివి 19 కోట్లకు ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ టాక్. డిసెంబర్ రెండోవారంలో ఆడియో విడుదల కానున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll