టాలీవుడ్ రివ్యూస్

రివ్యూ ‘పద్మావత్’ : అందమే ఆమె శత్రువు

padmavathi-reviewచెప్పుకోవటానికి మనకు బోలెడు చరిత్రం ఉన్నా… చరిత్ర సినిమాలు మనకు కాస్తంత తక్కువనే చెప్పాలి. ఎవరి చరిత్ర ముట్టుకుంటే ఏ వివాదాలు వస్తాయో అని ఏ దర్శక,నిర్మాత ధైర్యం చేయలేని పరిస్దితి. అయినా సరే సంజయ్ లీలా భన్సాలీ ధైర్యం చేసారు. మేవాడ్ మహారాణి పద్మావతి దేవి చరిత్రను తెరకెక్కించారు. అయితే సినిమాలో అసలు ఏమి తీసారో..తీస్తున్నారో అనే విషయం కూడా పట్టించుకోకుండా …చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ గత కొద్ది నెలలు గా దేశం మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా వివాదాలు చేసారు. కోర్టుకు వెళ్లారు. అయితే ఆ వివాదాల్లో నిజం ఎంత ఉంది…పద్మావతి ఎలా ఉంది. టైటిల్ అంత అందంగా సినిమా కూడా ఉందా, మన తెలుగు వాళ్లకు సినిమా నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి…

మేవాడ్ రాజపుత్ర రాజు మహారావల్‌ రతన్‌ సింగ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న పద్మావతి (దీపిక పదుకోని) చాలా అందగత్తె. ఆ రోజుల్లో ఆమె అందం గురించి మాట్లాడుకోని వారు ఉండేవారు కాదన్నట్లుగా ఉండేది. అయితే ఆ అందమే ఆమెకు ముప్పు తెచ్చి పెడుతుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు. ఆమెపై అప్పటి డిల్లీ సుల్తాన్ ,మహా దుర్మార్గుడు,బలవంతుడు అయిన అల్లావుద్దీన్ ఖిల్జీ కన్ను పడింది. ఎలాగైనా ఆమెను అనుభవించాలని తహతహలాడాడు. పెళ్లైన స్త్రీ అయినా వదలలేదు. అందుకోసం రకరకాల ఎత్తులు వేసాడు. యుద్దంచేసాడు. చివరకు పద్మావతి లొంగిందా…ఏమైంది..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. లేదా చరిత్రను తిరగెయ్యాల్సిందే.

మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందా

భన్సాలీ సినిమా అంటే ఓ తెలియని మ్యాజిక్ తో విజువల్స్ హత్తుకునేలా ఉంటాయి. ముఖ్యంగా గ్రాండియర్ గా ఇలాంటి కథలను తెరకెక్కించటంలో భన్సాలీ పండిపోయాడు. అదే ఈ సినిమాలోనూ మరోసారి ప్రూవ్ అయ్యింది.కాకపోతే ఆయన తన సినిమాలో షాట్స్ ఎలా ఉండాలో డిజైన్ చేసుకున్నారు కానీ ఎమోషన్స్ ఎలా ఉండాలనే అంచనాకు రాలేకపోయారనిపిస్తుంది. కథలో ఎక్కడా డెప్త్ కు వెళ్లరు. క్యారక్టర్స్ మధ్య ఉండాల్సిన భావోద్వేగాలను ప్రతిఫలించనివ్వలేదు. దాంతో ఏదో కార్టూన్ సినిమా చూసినట్లు అనిపించింది కానీ ..కన్నీళ్లు పెట్టించే ఓ కథని చూసినట్లు అనిపించలేదు.

ఎవరెలా చేసారు

ఇక ఈ సినిమాలో అల్లావుద్దీన్ ఖిర్జీగా చేసిన రణబీర్ సింగ్ జీవించాడనే చెప్పాలి. అయితే ఆ స్దాయిలో షాహిద్ కపూర్ మాత్రం రాణించలేకపోయారు. ఆ పాత్ర పరిధి కూడా సహకరించలేదు. అలాగే దీపిక పదుకోని ఈ సినిమాకు రైట్ ఛాయిస్ అని చెప్పాలి. అందానకి అందం, అభినయానికి అభినయం…సినిమాకు ఎస్సెట్ గా నిలిచింది.

ఇక వివాద విషయానికి వస్తే ..నిజానికి కర్ణ సేన ..అంత అల్లరి చేసేటంత సీన్ సినిమాలో లేదు. రాజపుత్రలను హైలెట్ చేస్తూ…డైలాగులు,సీన్స్ ఎన్నో పెట్టారు. కానీ అవేమీ తెలియక అనుకుంటాను వివాదం చేసారు.

టెక్నికల్ గా .. చెప్పాలంటే ఈ సినిమాలో స్క్రిప్టు విభాగం తప్ప మిగతావన్నీ హై స్టాండర్డ్స్ లోనే ఉన్నాయి. అయితే భన్సాలీ సినిమాల్లో కనపించే పాటలు మాత్రం ఈ సినిమాలో లేవు. ఎందుకనో ఆ మ్యాజిక్ మిస్సయ్యారు.

చివరి మాట

ఈ సినిమా మన వాళ్లకు ఎక్కుతుందా అంటే…కాస్త కష్టమనే చెప్పాలి. ఏదో వివాదం ఉంది కదా అని థియోటర్ కు పరుగెత్తకు వచ్చినా … కథకు కనెక్ట్ కావటం కష్టమే..అలాగే..తెలిసున్న ముఖం ఒక్కటీ లేకుండాపోయింది. బాహుబలి చూసిన కళ్లతో ఈ సినిమా ఆనుతుందా ఏమో చూడాలి.

Comments

comments

Trending

Latest

Teaser

Coming Soon

tr> tr> tr>
మనసుకు నచ్చింది JAN 26
భాగమతి JAN 26
చలో FAB 2
టచ్ చేసి చూడు FAB 2
తొలిప్రేమ FAB 9
ఆచారి అమెరికా యాత్ర

Now Showing

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
రంగుల రాట్నం JAN 14