టాలీవుడ్

టీమ్ లో ఎవరికీ నచ్చలేదట..ఏం చేస్తారో

Mohan-Krishna-Indraganti-and-Sudheer-Babuఇంద్రగంటి మోహన కృష్ణ-సుధీర్ బాబు కాంబినేషన్లో కృష్ణప్రసాద్ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూలు పూర్త చేసుకుంది. దాంతో ఈ చిత్రానికి ఏం టైటిల్ పెట్టబోతున్నారనే ఆసక్తి మొదలైంది. ఈ లోగా ఇదే బ్యానర్ మీద ఓ టైటిల్ రిజిస్టర్ అయింది. అదే సమ్మోహనం. అష్టాచ‌మ్మా, గోల్కొండ హైస్కూల్‌, జెంటిల్ మేన్, అమీతుమీ..తరహాలో ఈ టైటిల్ కూడా అందంగా, అర్థ‌వంతంగా ఉందని అంతా మెచ్చుకుంటున్నారు. అయితే ఈ టైటిల్ యూనిట్ లో కానీ,నిర్మాతకు కానీ నచ్చలేదంటున్నారు.

ఈ చిత్రం కూడా రొమాంటిక్ కామెడీ జోన‌ర్‌లో సాగే సినిమా అట‌. అందుకు త‌గ్గ‌ట్టుగానే.. ‘స‌మ్మోహ‌నం’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు ఇంద్రగంటి ఒప్పిస్తున్నారట. అయితే ఈ టైటిల్ మరీ క్లాస్ గా ఉందని, జనాలకు రీచ్ అవటం కష్టమని చెప్తున్నారు. సుధీర్ బాబు సైతం ఈ టైటిల్ పై విముఖత చూపిస్తున్నారు. దాంతో ఇంద్రగంటి మరో టైటిల్ వేటలో పడ్డారట. త్వ‌ర‌లోనే టైటిల్‌ని ఫైనల్ చేసి అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16