బాలీవుడ్

సమంత ఈ వార్త నిజమైనా, సైన్ చేసావా?

samantha-jfw-photo-shoot-still 3ఇప్పటికే బాలీవుడ్‌లో ప్రముఖ క్రికెటర్లు మహేంద్ర సింగ్‌ ధోనీ, అజహరుద్దీన్‌ల జీవితాధారంగా బయోపిక్‌లు వచ్చాయి. ఇప్పుడు కపిల్‌ దేవ్‌ హయాంలో భారత్‌ 1983 ప్రపంచ కప్‌ సాధించడంపై సినిమా రాబోతోంది. ఈ సినిమాకి ‘83’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇలా బాలీవుడ్‌కే పరిమితమైన బయో‌పిక్‌ల ట్రెండ్.. ఇప్పుడిప్పుడే దక్షిణాదికి కూడా పాకుతోంది. గోపిచంద్ బయోపిక్ తెరకెక్కనుందనే వార్తలు ఇంతకు ముందే విన్నాం. తాజాగా మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్.. బయోపిక్ త్వరలో తెరకెక్కనుందనే వార్త కూడా తెలిసిందే. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ బయోపిక్‌లో మిథాలీగా సమంత నటించనుందనే వార్త టాలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే… మహిళల టీం ఇండియా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ జీవితాధారంగా బయోపిక్‌ చేయటానికి సన్నాహాలు జరుగుతుననాయి. వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ ఈ చిత్ర నిర్మాణ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత రీల్‌ లైఫ్‌ మిథాలీ రాజ్‌గా నటించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. మిథాలీ రాజ్‌ పాత్ర కోసం వయాకామ్‌ సంస్థ సమంతతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

మరోప్రక్క అక్టోబర్‌ 6న సమంత.. నాగచైతన్యల వివాహం జరగనుంది. వివాహం తర్వాత పరిస్థితేంటని ఆమెను ఇటీవల అడిగితే మార్పేమీ ఉండదని.. సినిమాలు ఎప్పటిలాగే కంటిన్యూ చేస్తానని చెప్పిన విషయం విదితమే. అయితే పెళ్లి తర్వాత ఆమె ఏ మూవీలో నటించబోతోందని అంటున్నారు. అయితే అపీషియల్ సమాచారం ఏమీ లేదు. ఈ సినిమాకు ఒప్పుకుందా లేదా అన్న విషయమై స్పష్టత లేదు. ప్రస్తుతం సమంత ‘రంగస్థలం’, ‘మహానటి’ చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె కీలక పాత్రలోనటిస్తున్న ‘రాజుగారి గది 2’ చిత్ర షూటింగ్‌ ఇటీవల పూర్తైంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll